Breaking News

Daily Archives: June 8, 2024

ఇవాళ మృగశిర కార్తె ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేటి నుంచి (జూన్‌ 8) నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. ఆశ్విని మొదలుకుని రేవతి వరకు మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం.. ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం, ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు నుండి మృగశిర …

Read More »

అమరావతిలో నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్ వివేక్ యాదవ్ ఐఏఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఏపీ సీఆర్డ్ఏ, అమరావతి స్మార్ట్ సిటీ పనులను సంస్థ కమిషనర్ వివేక్ యాదవ్ ఐఏఎస్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ముఖ్యంగా అమరావతిలో ట్రంక్ రోడ్ల వెంబడి మరియు నిర్మాణంలో ఉన్న భవన సముదాయాల ప్రాంతాల్లో పెరిగిన మూళ్ళ కంపలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఇందుకు 76 జేసీబీ యంత్రాలను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేస్తున్న పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం రాయపూడిలో నిర్మాణంలో ఉన్న …

Read More »

రామోజీరావు మృతి పట్ల అమ్మ ప్రసాద్ సంతాపం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అక్షరం కాలాన్ని శాసిస్తే తట్టుకోలేని కాలం కాటు వేసింది…రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది అని విష్ణువర్జల అనంతరామ కృష్ణ ప్రసాద్ (అమ్మ ప్రసాద్) తెలిపారు. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. తెలుగుజాతి గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉంటారు. రామోజీరావు వ్యక్తి కాదు…వ్యవస్థ అని అన్నారు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నానని …

Read More »

ఘనంగా వ్యవసాయ కళాశాల 16వ వార్షికోత్సవం

-విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తుకు కళాశాల విద్య ఎంతో దోహదపడుతుంది. -వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ జి. కరుణాసాగర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తుకు కళాశాల విద్య ఎంతో దోహదపడుతుందని వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ జి. కరుణాసాగర్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరం(కాతేరు) వ్యవసాయకళాశాల నందు వ్యవసాయ కళాశాల 16వ వార్షికోత్సవ కార్యక్రమం వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ జి. కరుణాసాగర్ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలనతో ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ …

Read More »

రామోజీరావు వ్యక్తి కాదు…వ్యవస్థ

-ధర్మానికి కట్టుబడి సమాజహితం కోసం అనునిత్యం పని చేశారు -రామోజీరావు మరణం జీర్ణించుకోలేనిది : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు -రామోజీరావు పార్ధీవదేహానికి నివాళులర్పించిన చంద్రబాబు దంపతులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యుగపురుషుడిలా వెలిగిన రామోజీరావు మరణం జీర్ణించుకోలేనిదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజ హితం కోసం అనునిత్యం కష్టపడ్డ వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్ధీవదేహానికి పూలమాల వేసి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి నివాళులర్పించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను …

Read More »

రామోజీరావు అస్తమయం దిగ్భ్రాంతికరం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మీడియా మొఘల్  రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. తను నమ్మిన విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా పక్షం వహిస్తూ మీడియా ప్రపంచంలో రామోజీ రావు సాగించిన ప్రయాణం అసామాన్యమైనది. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటు.  రామోజీ రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీడియాకు సామాజిక బాధ్యత ఉందని బలంగా చాటారు. సారా వ్యతిరేక ఉద్యమం కావచ్చు, సమాచార హక్కు చట్టంపై అవగాహన కావచ్చు, జల సంరక్షణ కావచ్చు…. పలు సామాజిక …

Read More »

నిన్ను చూసి గర్విస్తున్నా సోదరా : కమల్ హాసన్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ కంగ్రాట్స్ చెప్పారు. ‘పవన్తో భావోద్వేగ సంభాషణ జరిగింది. ఎన్నికల్లో ఘన విజయంపై హృదయపూర్వక అభినందనలు తెలియజేశా. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సేవ చేసేందుకు బయలుదేరిన పవన్కు శుభాకాంక్షలు చెప్పా. నిన్ను చూసి గర్విస్తున్నా సోదరా’ అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.

Read More »

సియం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై సిఎస్ సమీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్.చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపధ్యంలో శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ సమావేశంలో సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ఈప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని కావున కట్టుదిట్టమైన చర్యలు …

Read More »

రామోజీరావు మృతి పట్ల మోటూరి శంకరరావు సంతాపం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మ విభూషణ్ గ్రహీత చెరుకూరి రామోజీరావు అకాల మరణం పత్రికా రంగానికి తీరని లోటు అని రాష్ట్ర మాజీ సైనిక సంఘం, వ్యవస్థాపక అధ్యక్షులు మోటూరి శంకరరావు అన్నారు. ఎడిటర్ వృత్తికి వన్నెతెచ్చిన మహనీయుడు, పత్రికల విలువలు పెంచిన గొప్ప కలం యోధుడు రామోజీరావు అని అన్నారు. ఆయన లేని లోటు యావత్ ప్రపంచానికి తీరని లోటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు …

Read More »

రామోజీరావు మరణం బాధాకరం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది అని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను అన్నారు. అవినాష్ రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

Read More »