Breaking News

రామోజీరావు అస్తమయం దిగ్భ్రాంతికరం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మీడియా మొఘల్  రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. తను నమ్మిన విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా పక్షం వహిస్తూ మీడియా ప్రపంచంలో రామోజీ రావు సాగించిన ప్రయాణం అసామాన్యమైనది. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటు.  రామోజీ రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీడియాకు సామాజిక బాధ్యత ఉందని బలంగా చాటారు. సారా వ్యతిరేక ఉద్యమం కావచ్చు, సమాచార హక్కు చట్టంపై అవగాహన కావచ్చు, జల సంరక్షణ కావచ్చు…. పలు సామాజిక అంశాలపై ప్రజా చైతన్యం తీసుకువచ్చారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి మీడియా రంగంలోనే కాకుండా సినీ నిర్మాతగా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సినీ స్టూడియో వ్యవస్థాపకులుగా, వాణిజ్యవేత్తగా ఆయన సాధించిన విజయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తాయి. రామోజీ రావు  కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *