-డి ఆర్ ఓ పెంచల కిషోర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : యోగా ను మన దైనందిన జీవితంలో కొంత సమయం కేటాయించి అలవర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని జయించి దృఢంగా ఆరోగ్యంగా ఉంటారని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా, వివిధ స్థాయి అధికారులు, విద్యార్థులు, యోగ అభ్యాసకులు తదితరులు హాజరవగా …
Read More »Monthly Archives: June 2024
సమగ్రంగా… సవివరంగా… సముచితంగా
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖలవారీ సమీక్ష సమావేశాలు -శాఖాపరమైన విషయాలు అవగాహనపరచుకుంటూ… ప్రాధాన్యాంశాలు నోట్ చేసుకుంటూ సాగిన సమావేశాలు -ఉన్నతాధికారులకు సముచిత గౌరవం ఇస్తూ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల పరిశీలన -శాఖలపై తన ఆలోచనలను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్ -పంచాయతీల్లో పారదర్శక పాలన… మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టీకరణ -అటవీ సంరక్షణకు చట్టాలు కఠినంగా అమలు… పర్యావరణ పరిరక్షణపై దిశానిర్దేశం రోజుకి 10 గంటలు చొప్పున సమీక్షలు, సమావేశాలు నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదుద్దుతాం
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సహజసిద్దమైన ప్రకృతి అందాలతో అలరారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది పరుస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం 5.50 గంటల సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం రెండో బ్లాక్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు …
Read More »అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి
-రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ -గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న …
Read More »నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించాయి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కర్ణాటక, కేరళ తీరాల మీదుగా ద్రోణి కొనసాగుతుందన్నారు. దీని ప్రభావంతో రేపు పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ …
Read More »అమరావతి, పోలవరం సంపద సృష్టి కేంద్రాలు
-ప్రజా రాజధానిని అపహాస్యం చేసి విధ్వంసం చేశారు -ఒక వ్యక్తి మూర్ఖత్వంతో రాష్ట్రానికి తీరని నష్టం -నాడు పుణ్యనదుల నుంచి తెచ్చిన నీరు, మట్టి వల్లనే నేడు మళ్లీ అమరావతి నిలబడింది -29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన ఏకైక ప్రాజెక్టు అమరావతి -80 శాతం పూర్తి అయిన నిర్మాణాలను అలాగే వదిలేశారు -రాజధాని పనులపై వైట్ పేపర్ విడుదల చేస్తాం…అందరి సహకారంతో, ప్రణాళికతో ముందుకు పోతాం -సీఎం నారా చంద్రబాబు నాయుడు -నాలుగు గంటల పాటు అమరావతిలో సీఎం పర్యటన….రాజధాని …
Read More »గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలి
-ఉపాధి హామీ నిధులు సద్వినియోగం కావాలి -నిధుల వినియోగం, సోషల్ ఆడిట్ నిర్వహణపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ అధికారులతో రెండున్నర గంటలపాటు సమీక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని ఆదేశించారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ …
Read More »బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్
-బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్ కు దస్త్రంపై తొలి సంతకం -ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపుపై రెండో సంతకం -వారంలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి -త్వరలో బిసి కమీషన్ ఏర్పాటుకు చర్యలు -రాష్ట్ర బిసి,ఇడబ్ల్యుఎస్,చేనేత జౌళిశాఖల మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందించే దస్త్రంపై తొలి సంతకంతో రాష్ట్ర వెనకబడిన తరగతుల సంక్షేమం,ఇడబ్ల్యుఎస్ మరియు చేనేత …
Read More »ఉన్న నిధులతో వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తూ రెండు ఫైల్స్ పై బాధ్యతలు స్వీకరిస్తూ తొలి సంతకాలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర చిన్న ,మధ్య సూక్ష్మ పరిశ్రమల, సెర్ప్, ఎన్నారై సంబంధాల శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర సచివాలయంలోని ఐదవ భవనంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా సచివాలయం చేరుకున్న మంత్రి వేద పండితుల ఆశీర్వచనాల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టి తొలుత శాఖాపరమైన ఫైల్స్ పై సంతకాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నాకు ఇచ్చిన ఈ బాధ్యతలను అత్యంత …
Read More »గుజరాత్ తరహాలో రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అభివృద్దిపరుస్తాం రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య & ఆహార శుద్ది శాఖ మంత్రి టి.జి.భరత్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామిక వృద్దిలో అత్యుత్తమ స్థానాన్ని పొందిన గుజరాత్ రాష్ట్రం తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది పరుస్తామని రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య మరియు ఆహార శుద్ది శాఖ మంత్రి టి.జి.భరత్ పేర్కొన్నారు. గుజరాత్ లో ఉన్న గిఫ్ట్ సిటీ తరహాలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. గురువారం ఉదయం 9.00 గంటల సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నాల్గో బ్లాక్ లో రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య మరియు …
Read More »