Breaking News

Daily Archives: December 18, 2024

పెట్రోల్ బంకును ప్రారంభించిన మంత్రి పి.నారాయణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక క్వారీ సెంటర్ రైతు బజారు ప్రక్కన బుధవారం ఉదయం రు. 1కోటి 96 లక్షలతో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థచే ఇండియన్ ఆయిల్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసి నిర్వహించనున్న ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ బంకు) ను రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డా.పి.నారాయణ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీ పరిధిలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాహనాల ఆయిల్స్ కొరకు ఆర్ ఎమ్ సి పరిధిలో ప్రతి నెలా …

Read More »

తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ ను మరింత బలోపేతం చేద్దాం

-సభ్యత్వాలను మరింతగా పెంచాల్సిన బాధ్యత వహించాల్సి ఉంది -జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మానవతా విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం, సేవా కార్యక్రమాలు చేపట్టడం లో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు చేసే సేవలు అనిర్విచనం అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కోసం సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ …

Read More »

హుకుంపేట రెవిన్యూ సదస్సు నిర్వహించిన రికార్డులను పరిశీలించిన కలెక్టరు ప్రశాంతి

-బుధవారం రెవిన్యూ సదస్సులో 14 అర్జీలు ఇవ్వడం జరిగింది హుకుంపేట (రాజమహేంద్రవరం రూరల్),  నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకి క్షేత్ర స్థాయిలో భూ సంబంధ సమస్యలు వారి ప్రత్యక్ష హజరు సమయంలో రికార్డులను పరిశీలించడం, వాస్తవ పరిస్థితిని వివరించడం కోసం గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట గ్రామ రెవెన్యూ సదస్సు ప్రాంతానికి మధ్యాహ్నం 3.30 గంటలకి కలెక్టర్ ఆకస్మికంగా రావడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి …

Read More »

న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు మైనారిటీ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రకాష్ బాబు మాట్లాడుతూ వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలకు నెలవైన భారతదేశంలో తక్కువ సంఖ్యలో ఉన్న తరగతుల వారిని మైనారిటీలుగా పరిగణిస్తామని అన్నారు. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం, 1992 చట్టంలోని వివిధ …

Read More »

“ఓపెన్ ఫోరమ్” ద్వారా సమస్య పరిష్కారం

-ప్రతి శుక్రవారం నిర్వహించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు -ప్రణాళిక విభాగం లో ఉదయం 10 గంటలకు అర్జీ దారులు హాజరై పరిష్కరించుకోవాాలి -రుడా విసి కేతన గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాముల మేరకు రుడా పరిధిలో గల ఎవరైనా భవన నిర్మాణ (బిల్డింగ్ ప్లాన్స్ ) మరియు ల్యాండ్ డెవలప్ మెంట్ (లే అవుట్ ) కొరకు అర్జీలు దాఖాలు చేసినవారు, ప్రణాళిక విభాగమునకు సంబంధించిన సమస్యల పరిష్కారము కొరకు తగిన పత్రాలతో హజరు కావాలని రుడా …

Read More »

నగరపాలక సంస్థ పరిధిలో సమగ్ర అభివృద్ధికి డిపిఆర్ సిద్దం చేయ్యాలి

-వొచ్చే ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది -గాడి తప్పిన ఆర్ధిక, పరిపాలన వ్యవస్థను గాడిలోకి తీసుకుని వస్తాం -ఎడీబి నిధులు, అమృత్ 2.0 నిధుల కేటాయింపు విషయంలో సానుకూలత వ్యక్తం చేశారు -ఫిబ్రవరి 2025 నాటికి పనులను ప్రారంభించి, రానున్న రెండేళ్ళ లో పూర్తి చేస్తాం -చెత్త నుంచి సంపద సృష్టి, డంపింగ్ యార్డ్ లేని నగరాల అభివృద్ది కోసం అడుగులు -రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆదాయం …

Read More »

స్టెల్లా కళాశాలలో హోర్టీ ఎక్స్పో

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రైతు దినోత్సవం 23 డిసెంబర్ న జరుపుకునే నిమిత్తం స్టెల్లా కళాశాల లో హోర్టీ ఎక్స్పో ఘనం గా ప్రారంభించారు ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ జసింత క్వదరస్ మాట్లాడుతూ రైతులు దేశానికి పట్టుకొమ్మలు అని రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులు ఆవిష్కరణలు గురించి అవగాహన వుండాలని తెలిపారు. డాక్టర్ లక్ష్మణ స్వామి అగ్రికల్చర్ విభాగాధిపతి మాట్లాడుతూ ఈ ప్రదర్శన లో పూలు పండ్లు పెంపకం,మరియు దిగుబడి పద్ధతులు,ఆర్గానిక్ ఫార్మింగ్ శిఫ్టింగ్ కల్టివేషన్ పరియవరణహిత పంటలు పనిముట్లు …

Read More »

లెప్రసి కేసు డిటెక్షన్ కాంపెయిన్ వర్క్ షాప్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : DLATOs , DNMOs , THward Medical Officers మరియి NGOs కి బుధవారం లెప్రసి కేసు డిటెక్షన్ కాంపెయిన్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా Commissioner of Health &Family Welfare వాకాటి కరుణ ఐఏఎస్ పాల్గొన్నారు. DPHFW డా, కే. పద్మావతి ఆంధ్ర ప్రదేశ్ లోని లెప్రసి స్థితి ని వివరించి చెప్పారు. గతం లో జరిగిన లెప్రసి కేసు డిటెక్షన్ కాంపెయిన్ జులై మరియు ఆగస్టు లో …

Read More »

మైనారిటీ హక్కుల దినోత్సవం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఏ.పీ.ఆర్ స్కూల్ మైనారిటీ బాయ్స్ మచిలీపట్నం నందు బుధవారం మైనారిటీ హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె.వి.ఆర్ కృష్ణయ్య సీనియర్ సివిల్ జడ్జి మచిలీపట్నం వారు పాల్గొని విద్యార్థులకు రాజ్యాంగంలో ఉన్నట్టు వంటి హక్కుల గురించి మరియు మైనారిటీ హక్కుల గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, ఉమ్మడి కృష్ణాజిల్లా,  అబ్దుల్ రబ్బాని మైనారిటీ పాఠశాల ప్రిన్సిపల్ వి.వెంకటేశ్వరరావు సీనియర్ లాయర్స్ …

Read More »

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయండి.. : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఈ నెల 20 వ తేదీ శుక్రవారం కృష్ణాజిల్లా పెనమలూరు మండలం గంగూరు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొనను న్నారన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించటంలో భాగంగా రైతు సేవా కేంద్రం, సమీపంలోని వెంకటాద్రి ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రైస్ మిల్, అనంతరం గంగూరు …

Read More »