– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం, ఒత్తిళ్లకు గురిచేసే విధానాలను కూటమి ప్రభుత్వం మానుకోవాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. పెదపరిమి లీడర్ షిప్ ట్రైనింగ్ క్యాంపులో నూజెండ్ల మండల ఉపాధ్యాయుడు యు.పోతురాజు స్పృహ కోల్పోయిన ఘటన బాధాకరమన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులపై కూటమి ప్రభుత్వం చేస్తున్న తీవ్రమైన మానసిక ఒత్తిడి మూలంగానే ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే రకరకాల యాప్ లు, ఎఫ్ఎల్ఎన్, లీడర్ షిప్ ట్రైనింగ్ లు, అపార్ నెంబర్ జనరేషన్ తదితర బోధనేతర పనులతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. ఇటువంటి సమయంలో ట్రైనింగ్ లు వద్దని ఉపాధ్యాయ సంఘాలు తమ గోడును విన్నవించినా.. ఉన్నతాధికారులు నిర్వహించడంతోనే పోతురాజు అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు. కనుక ప్రభుత్వం తక్షణమే ఈ లీడర్షిప్ ట్రైనింగులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
Prajavartha Online Telugu News