విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లబ్బీపేట వైవి రావు హాస్పిటల్ రోడ్ లో తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు,కార్యకర్తలు అడుగడుగున అవినాష్ కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ 19 వ డివిజన్ లో సంక్షేమ పథకాలు అమలు చేసి, కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. దోభిఖన లొ షెడ్లు వేశామన్నారు. మైనార్టీల చిరకాల కోరిక అయిన షాధిఖనకు రెండు కోట్లు,, సైట్ మంజూరు చేశామన్నారు. రాబోయే …
Read More »All News
పార్టీ శ్రేణులతో గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్, ప్రజాశక్తి నగర్ ప్రాంతాలలో దేవినేని సుధీర మరియు కేశినేని హైమ, 10వ డివిజన్, టీచర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ ప్రాంతాలలో దేవినేని క్రాంతి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకొంటూ ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి, 10వ డివిజన్ ఇంచార్జ్ కరుటూరి హరీష్ మరియు …
Read More »ఆన్ని అభివృద్ది పనులు, మౌలిక వసతులు కల్పించాం… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 6వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ అమర్ నాథ్ తో కలిసి తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ వైసిపి హయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరిస్తూ అవినాష్ ముందుకు సాగారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ సామాన్య ప్రజలు నివసించే ఈ ప్రాంతంలో ఆన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు. కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు చేశామన్నారు. టిడిపి హయాంలో ఓడిపోయిన …
Read More »చంద్రబాబు దుర్మార్గపు వ్యాఖ్యలపై ఈసీకి వైసీపీ బృందం ఫిర్యాదు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని పదేపదే కించపరుస్తూ.. చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ బృందం కోరింది. ఈ మేరకు మంగళవారం వెలగపూడి సచివాలయం నందు సీఈవో ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల టీడీపీ అధినేత చేస్తున్న వ్యాఖ్యలు జుగుప్సాకరమని మల్లాది విష్ణు అన్నారు. పాణ్యం సభలో హిట్లర్, బిన్ లాడెన్, నార్సీ, తాలిబన్ అంటూ.. ముఖ్యమంత్రి …
Read More »అల్లూరి త్యాగం తెలుగు జాతికే గొప్ప గౌరవం
-మన్యం వీరునికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘన నివాళి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన హక్కుల కోసం పోరాడి, వారిలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం తెలుగు జాతికే గొప్ప గౌరవమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అల్లూరి సీతారామరాజు నూరవ వర్థంతి సందర్భంగా బుడమేరు వంతెన వద్దనున్న ఆ మహనీయుని విగ్రహానికి ఘన నివాళులర్పించారు. మన్యం ప్రజల హక్కుల కోసం, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి …
Read More »సీఎం జగన్ తోనే సువర్ణపాలన
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంట్లో సంక్షేమ లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సువర్ణ పాలన సాధ్యమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 64వ డివిజన్ ప్రజాశక్తి నగర్లో మంగళవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మ, వెలంపల్లి సోదరుడు వెలంపల్లి రాఘవతో కలిసి గడప గడపకు వెళ్లి …
Read More »పోస్టల్ బ్యాలెట్ ని 1147 మంది ఉద్యోగులు సద్వినియోగం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల్లో ఓపిఓ విధులు కేటాయించబడిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ని 3వ రోజు 1147 మంది ఉద్యోగులు సద్వినియోగం చేసుకున్నారని, అందుకు తగిన విధంగా అసౌకర్యం కల్గకుండా, హెల్ప్ డెస్క్ లు, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం స్థానిక ఏసి కాలేజిలోని ఫెసిలిటేషన్ సెంటర్ ని పరిశీలించి, పోస్టల్ బ్యాలెట్ కి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ …
Read More »150 కోట్లు ఖర్చుపెట్టలేదు.. 600 కోట్లతో అభివృద్ది పనులు ఎలా జరిగాయి?
-మీట్ ది ప్రెస్‌లో తూర్పు టీడీపీ అభ్యర్ధి గద్దె రామ్మోహన్ ప్రశ్న విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 150 కోట్ల నిధులు ఖర్చుపెట్టలేదు. 600 కోట్లతో ఏ విధంగా అభివృద్ది పనులు ఎలా జరిగాయో చెప్పేవారికే తెలియాలని తూర్పు నియోజకవర్గ కూటమి టీడీపీ అభ్యర్ధి గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన మీట్‌దిప్రెస్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తాను విజయవాడ ఎం.పిగా, తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నానని, ప్రజల ఆశీర్వాదం …
Read More »పాఠశాలల్లో ఏటా యూత్ పార్లమెంట్ పోటీలను నిర్వహించాలి
-పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ -నోడల్ అధికారిగా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి నియామకం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని ఉన్నత పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులతో ప్రతి సంవత్సరం ‘యూత్ పార్లమెంట్ పోటీలు’ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేయడం, క్రమశిక్షణ, ఇతరుల అభిప్రాయాలను సహనంతో కూడిన ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడం, పార్లమెంటు పని గురించి విద్యార్థి సమాజానికి మెరుగైన అవగాహన …
Read More »పదవి విరమణ చేసిన గెజిటెడ్ ఉద్యోగులు ప్రతిపాదనలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే సమర్పించాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ నందు పనిచేసి పదవి విరమణ చేసిన మున్సిపల్ ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వ యాజమాన్యం నందు పదవి విరమణ చేసిన గెజిటెడ్ ఉద్యోగులు అనగా జిల్లా విద్యాశాఖాధికారులు, ఉప విద్యాశాఖాధికారులు, అసిస్టెంట్ డైరెక్టర్లు, మండల విద్యాశాఖాధికారులు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ మరియు నాన్ గెజిటెడ్ ఉద్యోగులు అనగా సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ యొక్క మెడికల్ రీయింబర్స్‌మెంట్ ప్రతిపాదనలను నేటి నుండి సంబంధిత డ్రాయింగ్ & …
Read More »