-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ ప్రక్రియ సజావుగా స్వేచ్చగా పారదర్శకంగా జరుగుతుందా లేదా అని పరిశీలించి రిపోర్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ చే నియమించబడిన సాధారణ పరిశీలకుల ప్రతినిథిగా ఉంటారని, తమపై గురుతర బాధ్యత ఉందని, ఎలక్షన్ కమిషన్ కళ్ళు చెవులు సూక్ష్మ పరిశీలకులు అని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలోని శ్రీనివాస …
Read More »All News
ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని ఎబిడిఎం తో లింక్ చేసేందుకు రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని ఎబిడిఎం తో లింక్ చేసేందుకు రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ayushman bharat digital mission-ABDM) రాష్ట్ర నోడల్ అధికారి బీవీ రావు అన్నారు. ఎబిడిఎం, ఎన్ఐసి బృందాల సమన్వయంతో ఈనెల 15, 16 తేదీలలో హాయ్ లాండ్ థీమ్ పార్క్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల డైరెక్టర్ ఆఫ్ సెకండరీ సర్వీసెస్ (డిఎస్ హెచ్) కింద పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, నర్సులు, …
Read More »బుధవారం సెలవు రోజు అయినప్పటికీ పని చేయనున్న జిఎంసి క్యాష్ కౌంటర్లు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2024-25) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించే వారికి మొత్తం పన్ను పై లభించే 5 శాతం రాయితీకి 2 వారాలే గడువు ఉన్నందున, పన్ను చెల్లింపుదార్లకు వీలుగా నగరపాలక సంస్థ క్యాష్ కౌంటర్లు సెలవు రోజుల్లో కూడా పని చేసేలా చర్యలు తీసుకున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పన్నును ముందస్తుగా చెల్లించే వారికి 5 …
Read More »నామినేషన్స్ స్వీకరణకు జిఎంసి ప్రధాన కార్యాలయంలో తగిన ఏర్పాట్లు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు సంబందించి ఈ నెల 18 నుండి నామినేషన్స్ స్వీకరణకు జిఎంసి ప్రధాన కార్యాలయంలో తగిన ఏర్పాట్లు చేశామని నగర కమిషనర్ & తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, 2024 సాదారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ మేరకు ఈ నెల 18 (గురువారం) నుండి …
Read More »రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల్లో ఎవరిపైన అయినా క్రిమినల్ కేసులు నమోదు అయి ఉంటే వారు తగిన వివరాలతో న్యూస్ పేపర్, టెలివిజన్ లలో 3 దఫాలుగా ప్రకటనలు ఇవ్వాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో, పశ్చిమ నియోజకవర్గ ఆర్ఓ, అదనపు కమిషనర్ …
Read More »కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వితంతు వివాహాలతో మహిళాభ్యుదయానికై కృషిచేసిన మహనీయుడు “కందుకూరి వీరేశలింగం పంతులు” జయంతి సందర్భంగా రాజమండ్రిలోని వంకాయల వారి వీధిలో వారి జన్మించిన వారి స్వగృహమును రాజమండ్రి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి దగ్గుబాటి పురందరేశ్వరి సందర్శించి వీరేశలింగం విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కందుకూరి వీరేశలింగం మొట్టమొదట జరిపించిన వితంతు వివాహ వేదిక నమూనా వద్ద పురంధరేశ్వరి తమ కుటుంబ సమేతంగా ఫోటో తీసుకున్నారు. వీరేశలింగం గృహాన్ని ప్రభుత్వం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న …
Read More »కళ్లెం నుంచి ట్రాక్టర్ కి ధాన్యం తరలిస్తున్న రైతులతో కలెక్టర్ మాధవీలత మాటమంతి
-21 రోజుల్లో డబ్బు జమ అవుతాయి -గన్ని బ్యాగుల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవడం జరుగుతుందని హమీ -ఎన్నికల శిక్షణా తరగతులకు హాజరయ్యే దారిలో రైతులతో కలెక్టర్ చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు రబీ సీజన్లో పండించిన ధాన్యాన్ని నిర్ణయించిన కనీస మద్దతు ధరకు కోనుగోలు చెయ్యడం జరుగుతుందనీ జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు. సోమవారం ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంలో మార్గమధ్యలో చాగల్లు వద్ద రైతులతో కలెక్టర్ సంభాషించడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ …
Read More »సుజనా చౌదరి వంటి వారిని ఓడించి ఈ ప్రాంతంలో రాజకీయ పరిణితి తెలియజేయాలి… : పోతిన మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్ఆర్సిపి నాయకులు పోతిన మహేష్ తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెత్తందారులు తలుచుకుంటే మాలాంటి వాళ్ల జీవితాలు గల్లంతవుతాయని పెత్తందారులు పూనుకుంటే ఏళ్ల తరబడి పడిన శ్రమ ఆవిరైపోతుందని కాళ్లు కింద పెట్టి ప్రజలు బాధలు తెలుసుకోలేని వాళ్ళు నలుగురికి బాసటగా నిలబడ లేని వాళ్ళు ఈ రోజున మోసం చేసి బ్యాంకులు కొల్లగొట్టి డబ్బులు దోచేసి మన మీద మన ఉనికి మీద యుద్ధం చేస్తున్నారనే విషయాన్ని నగరాల సామాజిక వర్గం వారు …
Read More »కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారు శిక్షార్హులు
-మొబైల్ కోర్టులో నమోదయిన 33 కేసులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ 3 కార్యాలయంలో జరిగిన మొబైల్ కోర్టులో 33 కేసులు నమోదు అయ్యాయి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలతో రోడ్ల పైన చెత్త వేసిన వారికి, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రతి మంగళవారం జరిగే మొబైల్ కోర్టులో భాగంగా కార్పొరేషన్ కోర్టు న్యాయమూర్తి బి.విజయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఉదయం రోడ్డుపైన చెత్త వేసినందుకు, లైసెన్సు లేకుండా వ్యాపారం …
Read More »ప్రజల్లోకి వాస్తవాలు తీసుకెళ్లాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తప్పుడు వార్త లేదా తప్పుదారి పట్టించే సమాచారాల విషయంలో సమష్టిగా ప్రతిస్పందించాలని, ప్రజల్లోకి వాస్తవాలు తీసుకెళ్లాలని ఐఎంపీసీసీ (ఇంటర్ మీడియా పబ్లిసిటీ కోర్డినేషన్ కమిటీ) తొలి సమావేశంలో నిర్ణయించారు. విజయవాడలోని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్‌లో ఈ రోజు ఐఎంపీసీసీ మొదటి సమావేశం జరిగింది. రైల్వే, తపాలా, ఆదాయ పన్ను, కేవీఐసీ, విమానాశ్రయ అథారిటీ, మంగళగిరి ఎయిమ్స్, ఎన్‌వైకేఎస్, ఎన్‌ఎస్‌ఎస్‌వో, దూరదర్శన్, ఆకాశవాణి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార …
Read More »