Breaking News

All News

విజ‌య‌వాడ చేరుకున్న ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్

-నగరంలోని నోవాటెల్ వద్ద స్వాగతం పలికిన కలెక్టర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రిటైర్డు ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ ను ఈసీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక వ్యయ పరిశీలకులు (స్పెషల్ ఎక్స్ పెన్డిచర్ అబ్జర్వర్)గా ఇటీవ‌ల నియ‌మించింది. మంగళవారం రాత్రి డిల్లీ నుంచి నగరానికి చేరుకున్న స్పెషల్ ఎక్సపెన్డిచర్ అబ్జర్వర్ నీనా నిగమ్ ను నోవాటెల్ వద్ధ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు.

Read More »

ఏలూరు లో ఎన్నికల ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా…

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణ సన్నద్ధత ను పరిశీలించేందుకు మంగళవారం స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా ఏలూరు విచ్చేసారు. తొలుత కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ మీడియా కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. తొలుత మీడియా కంట్రోల్ రూమ్ నిర్వహణ తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా లో ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై వచ్చే ప్రతికూల వార్తలను నమోదు …

Read More »

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు ఐఎస్ఓ గుర్తింపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు ( ఏ పి యస్ యస్ డి సి ) ఐఎస్ఓ గుర్తింపు సిబ్బంది సమిష్టి కృషితోనే సాధ్యమయిందన్న నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణాశాఖ ప్రధాన కార్యదర్శి యస్.సురేష్ కుమార్ ఐఏఎస్ ఐఎస్ఓ సర్టిఫికెట్ సాధించడం ద్వారా మరో మైలురాయి చేరామని హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) 9001 – 2015 సర్టిఫికెట్ ను గ్లోబల్ మానేజ్మెంట్ సర్టిఫికేషన్ ప్రైవేట్ …

Read More »

స్కూళ్లకు వేసవి సెలవులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు సెలవులు ఉంటాయని.. జూన్ 12న స్కూళ్లు పున:ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 23న స్కూళ్లకు చివరి పనిదినంగా పేర్కొంది.

Read More »

పిఠాపురం నియోజక వర్గంలో ఇంటింట ప్రచారానికి సన్నద్ధం

పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిమిత్తం టిడిపి ఇంఛార్జి ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ ఆధ్వర్యంలో టిడిపి రూపొందించిన కరపత్రాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. కూటమి అధికారంలోకి వచ్చాక పిఠాపురం నియోజక వర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాం అనే అంశంపై పవన్ కళ్యాణ్ నిబద్ధతతో చెప్పిన హామీలను ఇందులో పొందుపరిచారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “పిఠాపురం నియోజకవర్గానికి ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగి ప్రాంతం. జైన, బౌద్ధ, శైవ, …

Read More »

జిల్లాలో 3వ తేదీ నుండి సామాజిక బద్రతా పింఛన్లను పంపిణీ చేయండి..

-వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యం, వీల్‌చైర్‌కు పరిమితమైన, యుద్దవీరుల వృద్ద వితంతులకు ఇంటి వద్దే పంపిణీ.. -జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం ఆదేశాలను పాటిస్తూ రాష్ట్ర ఉన్నతాధికారుల మార్గదర్శకాల మేరకు ఈనెల 3వ తేది బుధవారం నుండి సామాజిక బద్రతా పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని, వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యం, వీల్‌చైర్‌కు పరిమితమైన, యుద్దవీరుల వృద్ద వితంతులకు ఇంటి వద్దే పంపిణీతో పాటు మిగిలిన వారికి పెన్షన్‌దారుల సమీపంలోని సచివాలయాల ద్వారా పంపిణీ …

Read More »

జిల్లాలో ఎన్నిక‌ల ఏర్పాట్లు భేష్‌

-ఎన్నిక‌ల రాష్ట్ర స్పెష‌ల్ జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్ రామ్ మోహ‌న్ మిశ్రా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధార‌ణ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్; పోలీస్ క‌మిష‌న‌ర్.. ఇత‌ర ఉన్న‌తాధికారుల సమ‌న్వ‌యంతో చేప‌ట్టిన ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయ‌ని.. ఇదే పంథాను చివ‌రి వ‌ర‌కు కొన‌సాగించి విజ‌య‌వంతంగా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను పూర్తిచేసేందుకు కృషిచేయాల‌ని రాష్ట్ర ప్ర‌త్యేక సాధార‌ణ ప‌రిశీల‌కులు రామ్ మోహ‌న్ మిశ్రా అన్నారు. సాధార‌ణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈసీఐ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి స్పెష‌ల్ జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్‌గా నియ‌మించిన రామ్ మోహ‌న్ మిశ్రా …

Read More »

గురుకుల అడ్మీషన్లకు దరఖాస్తు గడువు పెంపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును 31-03-2024 నుండి 05-04-2024 వరకు పొడగించినట్లు ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్. నరసింహారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో 5,6,7, 8 తరగతులలో మిగిలిపోయిన సీట్లు(బ్యాక్ లాగ్ సీట్లు), ఇంటర్ మరియు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్ధేశించిన APRS CET-2024, APRJC&DC CET-2024 లకు దరఖాస్తు గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడగించినట్లు ఆయన పేర్కోన్నారు. అర్హత …

Read More »

రాష్ట్ర ప్రజలకు బాబు వాయిస్ మెసేజ్ లపై సీఈఓకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు

-మూడు అంశాలను లేఖలో ప్రస్తావించిన వైసీపీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని భగ్నం చేయడమే కాకుండా వాయిస్ మెసేజ్ ల ద్వారా రాష్ట్ర ప్రజలకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబు, తెలుగుదేశం పార్టీపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాకు సచివాలయంలోని ఆయన కార్యాలయం నందు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అనుమతులు లేకుండా లక్షలాది మంది ప్రజలకు వాయిస్ మెసేజ్ …

Read More »

పాఠశాలల్లో తప్పకుండా ‘వాటర్ బెల్’ కార్యక్రమం అమలు చేయాలి

-డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదేశాలు జారీ -విద్యార్థుల, ఉపాధ్యాయులు వేసవి తాపం నుండి జాగ్రత్తలు తీసుకోవాలి -రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పలు చోట్ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యార్థులు డీహైడ్రేషన్ (నిర్జలీకరణ)కు గురికాకుండా పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్  జిల్లా విద్యాశాఖాధికారులకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో 2-3 డిగ్రీల …

Read More »