Breaking News

సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేయడంపై వెనుకబడిన తరగతుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం చంద్రబాబునాయుడుకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆయా సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు గురువారం అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నాలుగో బ్లాక్ లో ఉన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను దుశ్శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతే లక్ష్యంగా అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. వెనుబడిన తరగతులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు సాగిస్తున్నారన్నారు. పదవులు, సీట్లు కేటాయింపుల్లోనూ బీసీలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. మరింత మంది బీసీలకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించాలన్న ఉద్దేశంతో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని తీర్మానం చేశారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పన కృషి చేస్తామంటూ ఇచ్చిన హామీని సైతం సీఎం చంద్రబాబునాయుడు నెరవేర్చుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎం మూర్తి, బీసీ సంఘ నేతలు దేవుళ్ల మురళి, ఆదినారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *