Breaking News

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్ వద్ద గల సమావేశపు గదిలో శాఖధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో వ్యర్థ పదార్థాల నిర్వహణ 2026 నియమావళి ప్రకారం, నగర పరిధిలో గల మూడు చెత్తబుట్టలను నాలుగు చెత్త బుట్టలుగా చేయాలని, ఎరుపు, పచ్చ, నీలంతో పాటు నలుపు రంగు గల చెత్తబుట్టను కూడా వాడాలని అధికారులను ఆదేశించారు. కూరగాయల వ్యర్ధాలు, పళ్ళ వ్యర్ధాలు లాంటి తడి చెత్త, పచ్చబుట్టలో, పేపర్ ముక్కలు, అట్టముక్కలు, ప్లాస్టిక్ బాటిల్ లాంటి పొడి చెత్త, నీలం బుట్టలో, డైపర్, సానిటరీ నాప్కిన్లు, వాడి పడేసిన కాటన్ బ్యాండేజ్ లాంటి చెత్త, ఎరుపులో వేయడమే కాకుండా పగిలిపోయిన బల్బులు, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వ్యర్ధాలు, పెయింట్ డబ్బాలు, నెయిల్ పాలిష్ లాంటివి, నలుపు రంగులో గల చెత్తబుట్టలో వేసేటట్టు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వేసవికాలం దృశ్య అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీటి సరఫరాలో, పార్కుల నిర్వహణ, సమ్మర్ క్యాంపు, మొక్కల సంరక్షణ వంటి విషయాల్లో ఎటువంటి లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి. చంద్రశేఖర్ చీఫ్ సిటీ ప్లానర్, కె.సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి. సత్యకుమారి, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) ఎం.విజయలక్ష్మి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

-రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల ఉద్యోగాలకు అవకాశం -సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ సిద్ధం చేయండి -గనుల శాఖ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *