విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు, యువతులు ఆర్థికంగా ఎదుగడానికి వాసవ్య మహిళా మండలి వివిధ కార్యక్రమాల ద్వారా శిక్షణను ఇస్తుందని సంస్థ అధ్యక్ష్యులు డాక్టర్ బొల్లినేని కీర్తి తెలిపారు. హెచ్.సి.యల్ సహకారంతో గన్నవరం, విజయవాడలో శిక్షణా కేంద్రాలలో టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, హ్యాండ్ ఎంబ్సైడరి, అత్యాధునిక డిజైనర్ బ్లౌజులు మరియు డ్రెస్ ల తయారి, మగ్గం వర్క్, టాలి, జి.ఎస్.టి, కంప్యూటర్ శిక్షణ రంగాలలో శిక్షణ పొంది ఎందరో యువతులు, మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారని ఆమె అన్నారు. …
Read More »All News
పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి జగన్ సర్కార్, అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం, అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను వినియోగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎపీలో దాదాపు 1,25,000 మంది సచివాలయ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 66 లక్షల మంది పెన్షన్‌దారులకు 1 లక్ష …
Read More »వాలంటీర్లే రాజకీయ వారధులు!
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయాల్లో కొత్తపోకడలు వచ్చాయి. రాజకీయాల్లో వ్యాపారం పోయింది. రాజకీయమే వ్యాపారం అయింది. ఏపీ ఎన్నికల వేళ సరికొత్త విన్యాసాలు మొదలయ్యాయి. నిజానికి ఇవి ఇప్పుడు మొదలు కాలేదు. వీటికి బీజం వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పడిరది. ఏ లక్ష్యాన్ని ఆశించి వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చారో అది పూర్తీ స్థాయిలో విజయవంతం అయింది. ఒక గొలుసుకట్టు వ్యాపారంలా.. ఇదొక గొలుసుకట్టు రాజకీయం. ఏభై కుటుంబాలకో వాలంటీర్. వాళ్ళ మంచీ చెడ్డా చూడడం అనే …
Read More »ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహించండి
-జిల్లా కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు నంద్యాల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీశైల మహాపుణ్య క్షేత్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే ఉగాది మహోత్సవాలలో భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు దేవస్థానం, సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఉగాది మహోత్సవాలపై జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి, …
Read More »“దశదిన సంస్కృత సంభాషణ శిబిరం”
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆలయ ఈవో కె ఎస్ రామరావు దేవస్థానంనకు అనుబంధంగా ఉన్న పోరంకిలో ఉన్న స్మార్థ వేదపాఠశాలకు సోమవారం విచ్చేసి సంస్కృతభారతీ, ఆంధ్రప్రదేశ్ సంస్థ వారి చేత పాఠశాల లోని వేదవిధ్యార్థులకు సంస్కృతం లో సంభాషణ నేర్పుట కొరకు 10 రోజుల నీడివి గల “దశదిన సంస్కృత సంభాషణ శిబిరం” ను ప్రారంభించి, విద్యార్థులకు సంస్కృత భాష యొక్క ప్రామిఖ్యతను, అమ్మవారి సుప్రభాతం ను గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంనకు సంస్కృత భారతీ ట్రస్ట్ కార్యదర్శి, సంచాలకులు డా.యూ …
Read More »అవ్వాతాతలను ఇబ్బందిపెట్టి రాక్షసానందం పొందుతున్న చంద్రబాబు
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అవ్వాతాతలకు ఒకటో తేదీన పింఛన్ అందకుండా చేసి చంద్రబాబు అండ్ కో రాక్షస ఆనందం పొందుతున్నారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. పైగా ఏ ముఖం పెట్టుకుని ఎల్లో బ్యాచ్ సీఎస్ ను కలుస్తారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన కార్యాలయం సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. అవ్వాతాతలు, దివ్యాంగులు ఒకటో తేదీన వచ్చే పింఛన్ కోసం వేయి కళ్లతో …
Read More »విజయవాడ చేరుకున్న స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా
-నగరంలోని నోవాటెల్ వద్ద స్వాగతం పలికిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 1987 బ్యాచ్‌కి చెందిన రిటైర్డు ఐ.ఏ.ఎస్. అధికారి రామ్ మోహన్ మిశ్రాను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ జనరల్ అబ్జర్వర్ గా ఇటీవల నియమించింది. సోమవారం రాత్రి డిల్లీ నుంచి నగరానికి చేరుకున్న స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రాకు నోవాటెల్ వద్ధ రాష్ట్ర ప్రధాన ఎన్నికల …
Read More »జిల్లాలో ఉపాధి హామి కింద 82 లక్షల పని దినాలను కల్పించాలనేది లక్ష్యం..
-ప్రతి వారం 5 లక్షల పని దినాలను కల్పించేందుకు ప్రణాళిక.. -వేసవిలో త్రాగునీటికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.. -జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామి పథకం ద్వారా పని కోరిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని, 82లక్షల పని దినాలను కల్పించాలనే లక్ష్యం కాగా ప్రతి వారం 5 లక్షల పని దినాలను కల్పించేందుకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామని వేసవిలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాట్లు …
Read More »చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్‌డీవో భవానీ శంకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉన్న నేపథ్యంలో సోమవారం విజయవాడ ఆర్‌డీవో, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఆర్‌వో బీహెచ్ భవానీ శంకర్ వివిధ చెక్‌పోస్టులను ఆకస్మికంగా సందర్శించారు. వారధి, ఆటోనగర్, రామవరప్పాడు రింగ్ చెక్‌పోస్టులను పరిశీలించి తనిఖీలు జరుగుతున్న తీరును పరిశీలించారు. అక్రమంగా నగదు, మద్యం, విలువైన లోహాలు వంటి వాటి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సిబ్బంది నిరంతర నిఘా, అప్రమత్తతతో వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆర్‌డీవో భవానీ శంకర్ సూచించారు. ప్రతి …
Read More »షెడ్యూల్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్‌కు చర్యలు
– పోలింగ్ సిబ్బందికి దశల వారీగా శిక్షణకు ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈసీఐ, సీఈవో మార్గదర్శకాలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ ప్రక్రియకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు వివరించారు. సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా.. అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి …
Read More »