Breaking News

All News

నేడు అన్ని పాలిటెక్నిక్ లలో పాలిసెట్ గ్రాండ్ టెస్టు నిర్వహణ

-సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి -పాలిసెట్ ప్రవేశ పరీక్షపై అవగాహన కల్పించేలా గ్రాండ్ టెస్టు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ లలో ప్రవేశం కోసం నిర్వహించే “పాలిసెట్ – 2024“ సన్నాహక, సన్నద్దత కార్యక్రమంలో భాగంగా పాలిసెట్ గ్రాండ్ టెస్టును ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నిర్వహించనున్నట్లు సాంకేతికి విద్యా శాఖ కమీషనర్, సాంకేతిక విద్య , శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. తొలుత ఈ పరీక్షను గురువారం నిర్వహించాలని భావించినా, …

Read More »

మలేసియాలో ఘోర ప్రమాదం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మలేసియాలో ఘోర ప్రమాదం సంభవించింది. నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు గగనతలంలో ఢీకొనడం వల్ల 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మలేసియాలో ఏప్రిల్ 26న రాయల్ మలేసియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా పెరక్‌లోని లుమత్‌ ప్రాంతంలో రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం శిక్షణ విన్యాసాల కోసం గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది …

Read More »

నామినేషన్‌ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థిని అరుణకుమారి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిని ప్రత్తిపాటి అరుణకుమారి రామవరప్పాడు నుంచి భారీ ర్యాలీగా వెళ్ళి నామినేషన్‌ వేశారు. మంగళవారం ఇండిపెండెంట్‌ అభ్యర్థినిగా గన్నవరం తహసిల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ వేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పార్టీ పుట్టినప్పటినుంచి పనిచేస్తున్నానని ఆ పార్టీలో దళితులకు స్థానం లేకుండా చేస్తున్నారని ప్రత్తిపాటి అరుణకుమారి అన్నారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పనిచేస్తున్న వారికి విలువలు లేవని కొత్తవారిని చేర్చుకొని పాతవారిని బయటికి పంపిస్తున్నారని ఆమె ఆవేదన …

Read More »

ఎన్డీయే గెలుపు…మాదిగల గెలుపు… : పేరెల్లి ఎలీషా మాదిగ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఉమ్మడి కృష్ణాజిల్లా ఎమ్మార్పీఎస్‌ నాయకుల సమావేశం జరిగింది. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన ఉమ్మడి కృష్ణాజిల్లా ఎమ్మార్పీఎస్‌ నాయకుల సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా మాదిగ మాట్లాడుతూ సామాజిక న్యాయం చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మాదిగలకు తీరని ద్రోహం చేశారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ సీట్లు 29 ఉండగా అందులో మాలలకు 19, మాదిగలకు 10 కేటాయించి మాదిగలకు ద్రోహం చేశారన్నారు. జగన్‌ వర్గీకరణకు వ్యతిరేకమా సానుకూలమా చెప్పాలని …

Read More »

కాంగ్రెస్ పార్టీ నాయకులతో చిగురుపాటి బాబురావు పరిచయ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని మారుతినగర్ లోని ఎపిసిసి ఉపాధ్యక్షులు వి.గురునాధం  స్వగృహము నందు మంళవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిగురుపాటి బాబురావు తో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎపిసిసి ఉపాధ్యక్షులు వి.గురునాథం  మాట్లాడుతూ.. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీ, సిపిఐ బలపరిచిన సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు కి జరగబోయే శాసనసభ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలియజేసి వారికి ప్రచార …

Read More »

సమాజం అంతా ఓటు హక్కు వినియోగించాలి

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కును సమాజంలోని ప్రతి ఒక్కరూ విధిగా ఉపయోగించుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మరియు మునిసిపల్ కమిషనర్ అయిన బండి శేషన్న బ్యాంక్ ఉద్యోగులకు,కస్టమర్లకు పిలుపు నిచ్చారు. మంళవారం స్వీప్ (SVEEP) ఓటర్ల అహగాహన కార్యక్రమంలో కొత్తపేట లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్యాలయంలో ఉద్యోగులకు ” ఓటు హక్కును వినియోగించుకుందాం – ధర్మ బద్ధమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుందాం ” అంటూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా SBI చీఫ్ మేనేజర్ AVR పవన్ …

Read More »

ఓట‌ర్ల చైత‌న్యంపై అవ‌గాహాన

విశాఖ‌ప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ క‌మ్యూనికేష‌న్‌(సిబిసి) ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం ప్ర‌భుత్వ విశాఖ మ‌హిళా డిగ్రీ కాలేజీలో నిర్వ‌హించిన ఓట‌ర్ల అవ‌గాహ‌న స‌ద‌స్సుకు విశేష స్పంద‌న ల‌భించింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న వ్య‌వ‌స్థికృత ఓట‌ర్ల విద్య‌, ఓట‌ర్ల భాగ‌స్వామ్యం కార్య‌క్ర‌మం-స్వీప్‌( Systematic Voter’s Education and Electoral Programme-SVEEP)పై వయోజ‌న ఓట‌ర్ల‌కు ఏర్పాటు చేసిన అవ‌గాహన కార్య‌క్ర‌మంలో ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో మ‌రియు సిబిసి ఆంధ్రప్ర‌దేశ్ రాష్ర్ట అధ‌న‌పు …

Read More »

అన్ని గ్రామ పంచాయతీల్లోను ఉపాధి హామీ పనులు చేపట్టండి.

-ఉపాధి హామీ పనులను చేసిన కూలీలకు సకాలంలో సొమ్ము చెల్లించండి -సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను త్వరిత గతిన నీటితో నింపండి -సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు నిర్వహించేందుకు ప్రస్తుతం మంచి అనుకూల సమయమని కావున అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపాధి పనులు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.రాష్ట్రంలో తాగునీరు,ఉపాధి హామీ పనులు,నీటి సరఫరా,విద్యుత్ సరఫరా పరిస్థితులపై మంగళవారం …

Read More »

నిరంతర నిఘాతో రాష్ట్రాన్ని జల్లిడిపడుతున్న త్రిబుల్ “సి”

-ఎంసిసి ఉల్లంఘనలు, మద్యం అక్రమ రవాణా, సీజర్లపై త్రిబుల్ “సి” నిఘా నేత్రం -వెబ్ కాస్టింగ్ ద్వారా అంతర్-రాష్ట్ర్ర చెక్ పోస్టుల్లో వాహనాల కదలికపై పర్యవేక్షణ -వెబ్ కాస్టింగ్, జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా మద్యం సరఫరాపై నియంత్రణ -ఎంసిసి ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు వినియోగిస్తున్న దాదాపు 1,680 వాహనాలను జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షణ -ఎలక్ట్రానిక్ చానళ్లలో నిరంతరాయంగా ప్రాసారం అయ్యే వార్తాంశాలపై ప్రత్యేక దృష్టి -అత్యాధునిక సాంకేతికత అనుసందానంతో రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుండి పర్యవేక్షణ -సిఈఓ శ్రీ ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో …

Read More »

గరికిముక్కు రవికుమార్‌ను అభినందించిన పలువురు వైసీపీ నాయకులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితుడైన ఎన్టీఆర్‌ జిల్లా, మైలవరం నియోజకవర్గం, గొల్లపూడి గ్రామానికి చెందిన గరికిముక్కు రవికుమార్‌ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్‌, రాష్ట్ర శాసనమండలి సభ్యులు, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ సెంట్రల్‌ ఆఫీస్‌ కోఆర్డినేటర్‌ లేళ్ళ అప్పిరెడ్డి, ఎన్టీఆర్‌ జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌లు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. …

Read More »