Breaking News

సమాజం అంతా ఓటు హక్కు వినియోగించాలి

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటు హక్కును సమాజంలోని ప్రతి ఒక్కరూ విధిగా ఉపయోగించుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మరియు మునిసిపల్ కమిషనర్ అయిన బండి శేషన్న బ్యాంక్ ఉద్యోగులకు,కస్టమర్లకు పిలుపు నిచ్చారు. మంళవారం స్వీప్ (SVEEP) ఓటర్ల అహగాహన కార్యక్రమంలో కొత్తపేట లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్యాలయంలో ఉద్యోగులకు ” ఓటు హక్కును వినియోగించుకుందాం – ధర్మ బద్ధమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుందాం ” అంటూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా SBI చీఫ్ మేనేజర్ AVR పవన్ కుమార్ మాట్లాడుతూ మే 13 వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేసి,మంచి నాయకులను ఎన్నుకోవటానికి యువత ముందుకు రావాలని తెలియచేసి బ్యాంక్ ఉద్యోగులు, కస్టమర్ల చేత ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్య్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్ మరియు మునిసిపల్ అసిస్టెంట్ కమిషనర్ అయిన  కె.అనూష, SBI కొత్తపేట డిప్యూటీ మేనేజర్ బి. లక్ష్మా నాయక్,సీనియర్ అసోసియేట్ టి.చందన, శానిటరి ఇనస్పెక్టర్లు ఆకురాతి రామచంద్రరావు, దావులూరి శ్రీనివాసరావు, వై.అనుపమ, మెప్మా సి. యం. యం.లు మాధవరావు,అరుణ మరియు మునిసిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *