-స్పందనలో 102 ఆర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా సమస్యలను తక్షణమే పరిష్కరించి వారి ఆకాంక్షలు నేరవేర్చాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధికారులను కోరారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచిస్తూ స్పందన కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారం …
Read More »Andhra Pradesh
సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మనుతో కలిసి సందర్శించిన పేర్నాటి దంపతులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మనుతో కలిసి పేర్నాటి దంపతులు సందర్శించారు. తెలంగాణ రాష్ట్రం, జనగామ హెడ్ క్వార్టర్ పరిధిలోని సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి రాష్ట్ర నాయకులు పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ పేర్నాటి హేమ సుష్మిత సందర్శించారు. ముందుగా సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో రెండు రాష్ట్రాల చైర్మన్లు, …
Read More »NCC గ్రూప్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్టణం అసిస్టెంట్ డైరెక్టర్ గా రాజశేఖర రెడ్డి నియామకం..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం తిరుపతిలో పర్యవేక్షకులుగా విధులు నిర్వహిస్తున్న సి. రాజశేఖర రెడ్డి ని నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నం నందు సహాయ సంచాలకులు గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ డైరెక్టరేట్ (AP & T) ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ వింగ్ గుంటూరు కార్యాలయ ఎయిర్ కమాండెంట్ పి. మహేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ అండ్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ నిబంధనలు …
Read More »రౌండుటేబుల్ సమావేశంలో వామపక్ష, దళిత, ప్రజా సంఘాలు…
-కాకినాడ వెళ్ళనున్న రాష్ట్ర అఖిలపక్షం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దళితులు, మహిళలపై నిరవధికంగా జరుగుతున్న హత్యలు, అఘాయిత్యాలను నిరసిస్తూ, విజయవాడ దాసరిభవన్‌లో సోమవారం, సిపిఐ రాష్ట్ర సమితి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. దీనికి వివిధ రాజకీయ పార్టీలు, దళిత, మహిళా, ప్రజా సంఘాలు, మేధావులు తదితరులు హాజరయ్యారు. సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షత వహించారు. దళిత, మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ, కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ, జూన్ 2న …
Read More »జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు డిటిపి ల నియామకం
-నియామక పత్రాలు అందజేసిన కలెక్టర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విధులు పట్ల నిబద్ధత, అంకితభావం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో డిటిపి ఆపరేటర్లకు నియామక పత్రాలు కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కర్రి మంగా దేవి, గుంటూరు భీమ సూర్య ప్రకాష్ లను అభినందించారు. కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న వికాస్ కేంద్రం ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, రాజమండ్రి నందు ఖాళీగా ఉన్న రెండు డేటా ఎంట్రీ ఆపరేటర్ …
Read More »హౌసింగ్ పై సూక్ష్మంగా, సమగ్రంగా సమీక్ష చేసిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో హౌసింగ్, ఉపాధి హామీ డేటా , లేఅవుట్ లలో ఫేజ్2 పనులు, ఎన్పిఐ, ఓటిఎస్, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు , రెవెన్యూ, తదితర శాఖల అంశాలపై జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, హౌసింగ్ పనుల విషయంలో ప్రతి ఒక్క లే అవుట్ పరిధిలో చేపట్టిన పనులను, తదుపరి స్టేజిలో చేసే పనులపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని స్పష్టం …
Read More »జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ఒక దీక్షలా చేపట్టాలి.
-గోపాలపురం మండలం లోని గ్రామాలకు 24 చెత్త సేకరణ రిక్షాల పంపిణీ -కలెక్టర్ డా. కే.మాధవీలత -ఎమ్ ఎల్ ఏ తలారి వెంకట్రావు గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్చ సంకల్ప కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడంలో ప్రజలు భాగస్వామ్యం అవ్వాలని కలెక్టర్ డా. కే.మాధవీలత , శాసనసభ్యులు తలారి వెంకట్రావు లు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక మండలాభివృద్ది అధికారి కార్యాలయం వద్ద నిర్వహించిన నియోజకవర్గ స్థాయి స్పందన కార్యక్రమం అనంతరం శాసనసభ్యులు తలారి వెంకట్రావు తో కలిసి కలెక్టర్ మాధవిలత …
Read More »ఒక వారం కలెక్టరేట్ లో, మరో వారం నియోజకవర్గ స్థాయిలో స్పందన
-ఈరోజు స్పందనలో 160 ఫిర్యాదులు అందాయి.. -ప్రతి ఫిర్యాదు పై తీసుకున్న చర్య పై సమీక్ష నిర్వహిస్తాం.. -కలెక్టర్ డా. కే.మాధవీలత గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : పాలన వికేంద్రీకరణ లో భాగంగా ఏర్పాటైన నూతన జిల్లాల యంత్రాంగం ప్రజలతో మమేకమైయ్యే దిశలో నియోజకవర్గ స్థాయి లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం గోపాలపురం మండల కార్యాలయ సమావేశ మందిరంలో, శాసన సభ్యులు తలారి వెంకట్రావు, జిల్లా అధికారులతో కలిసి స్పందన అర్జీలను స్వీకరించారు. …
Read More »ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలి
-వ్యవస్థలో సంస్థా గత నిర్మాణం పై దృష్టి పెట్టండి.. -ఈరోజు స్పందనలో 29 దరఖాస్తులు అందాయి -రూడా పరిధిలో స్పందనకి ఒకే ఫిర్యాదు -కె. దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డ్రైయిన్ , రహదారులు, పారిశుధ్య నిర్వహణపై ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ , రూడా వైస్ చైర్మన్ కె. దినేష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా …
Read More »మతసామరస్యాన్ని కాపాడే రచనలను ప్రోత్సహించాలి
– దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి – ఘనంగా సాక్షాత్కారము పుస్తక ఆవిష్కరణ సభ -పేదలకు నూతన వస్త్రాల పంపిణి తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : మత సామరస్యాన్ని కాపాడే రచనల అవసరత ఎంతైనా ఉందని, అలాంటి రచనలు చేస్తున్న రచయితలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని దళిత సార్వత్రిక విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి అన్నారు. కొత్తపేట లోని పెన్షనర్స్ హాల్ లో ఆదివారం రాత్రి పట్టణానికి చెందిన రచయిత కనపర్తి డేవిడ్ …
Read More »