హౌసింగ్ పై సూక్ష్మంగా, సమగ్రంగా సమీక్ష చేసిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో హౌసింగ్, ఉపాధి హామీ డేటా , లేఅవుట్ లలో ఫేజ్2 పనులు, ఎన్పిఐ, ఓటిఎస్, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు , రెవెన్యూ, తదితర శాఖల అంశాలపై జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, హౌసింగ్ పనుల విషయంలో ప్రతి ఒక్క లే అవుట్ పరిధిలో చేపట్టిన పనులను, తదుపరి స్టేజిలో చేసే పనులపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అనంతరం అనపర్తి, బిక్కవోలు, రాజానగరం , కోరుకొండ , పెరవలి, ఉండ్రాజవరం, తాళ్లపూడి , కొవ్వూరు, నిడదవోలు అర్భన్, రూరల్ మండలాల్లో గ్రామాల వారీగా ఇండ్ల నిర్మాణం పనులలో పెండింగ్ పై సమగ్రంగా సమీక్షించారు. రాజమండ్రి, కొవ్వూరు హౌసింగ్ డివిజినల్ ఇంజనీర్ లు సమగ్రంగా అధ్యయనం చేసి, గ్యాప్స్ లేకుండా చూడాలన్నారు. అధికారులు లే అవుట్ లలో విద్యుత్, త్రాగునీరు, లెవెలింగ్, అనుసంధాన రహదారులు వసతులు వివరాలు తెలియచేశారు. తదుపరి పనులు చేపట్టవలసి ఉన్నా వాటిపై సమగ్రంగా అధ్యయనం చేశారు. పై ఐదు అంశాలకు సంబంధించిన సమస్యలు లేవని అధికారులు తెలిపారు. తాళ్లపూడి మండలం లోని 10 లే అవుట్ లలో జలజీవన్ మిషన్ కింద టెండర్ పనులు వేగవంతం చేయ్యాలని కలెక్టర్ ఆదేశించారు. నిడదవోలు రూరల్ లో భూమి లేవిలింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. హౌసింగ్ డి ఈ లకు రీవైజ్డ్ స్టేటస్ అప్లోడ్ చేసేందుకు కొత్తగా మరోసారి లాగిన్ ఇవ్వడం జరిగినందున సంబందించిన డేటా నమోదు పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం ఫేజ్ 2 పనులపై సమీక్షించారు. ఉపాధిహామీ పథకంలో భూమి అభివృద్ధి పనులు, పెండింగ్ చెల్లింపుల విషయంలో వివరాలు అప్లోడ్ చెయ్యాలని పిడి డ్వామా ని ఆదేశించారు. భూసంబంధ, కోర్టు కేసులు తదితర అంశాలను సమీక్షించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్.శ్రీధర్, ఆర్డీవో లు ఎస్. మల్లి బాబు, ఏ. చైత్ర వర్షిణి, డిహెచ్ఓ బి. తారాసింగ్ , డ్వామా ఇంఛార్జి పిడి పి. జగదాంబ, రాజమండ్రి డీఏల్ డివో కే. రత్నకుమారి, ఆర్.డబ్ల్యు.ఎస్. ఈ ఈ డి.బాల శంకర్ రావు, ఎస్ ఈ (పి ఆర్) ఏబివి ప్రసాద్, సర్వే ఏ డీ .. పి. లక్ష్మణరావు, హౌసింగ్ ఏ ఈ లు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *