Breaking News

Andhra Pradesh

గామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలి…

-నిర్ణీత సమయంలోనే ప్రజా సమస్యలు పరిష్కరించాలి… -ప్రభుత్వ పథకాల వివరాలను తెలియజేసే బోర్డులను ప్రదర్శించాలి… -గ్రామాల్లో ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలి… -కోవిడ్ కట్టడికి “నో మాస్క్ నో ఎంట్రీ – “నో మాస్క్ – నో రైడ్”- “నో మాస్క్ – నో సేల్ “… -నినాదాలతో ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించాలి… -ఆర్డీఓ శ్రీనుకుమార్ కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయాలు ద్వారా ప్రజలకు అందిస్తున్నసేవలకు సంబందించి ఏ ఒక్క అంశం పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో …

Read More »

రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే…. : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రక్తం లభించక రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాణం పోకూడదని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. మొగల్రాజుపురంలోని జమ్మిచెట్టు సెంటర్ వద్ద నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు ప్రజల్ని చైతన్యపరచడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి 65 సంవ‌త్సరాల వ‌ర‌కూ ర‌క్తాన్ని దానం చేయ‌వ‌చ్చని మల్లాది విష్ణు  పేర్కొన్నారు. 3 నెల‌ల‌కు ఒక‌సారి …

Read More »

రవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శస్త్రచికిత్సలు…

-క్లిష్టమైన హెర్నియా ఆపరేషన్ ద్వారా 38 సెం.మీ గడ్డ తొలగింపు -రవి హాస్పిటల్ ఉచిత ఆపరేషన్ డ్రైవ్ లో విజయవంతంగా 30 శస్త్రచికిత్సలు -100 ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తామని డాక్టర్ రవికాంత్ కొంగర వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యాధునిక వైద్య సేవలు అందరికీ అందించాలనే లక్ష్యంతో రవి ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత ఆపరేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. సూర్యారావుపేట స్వాతి ప్రెస్ సమీపంలోని రవి హాస్పిటల్లో ఇంతవరకు 30 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించడం విశేషం. రవి ఫౌండేషన్ ద్వారా …

Read More »

పేద వారి కోసం పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పెళ్లిళ్ల సీజన్‌లో కళ్యాణ మండపాలు దొరకడమే కష్టం. దొరికినా సామాన్యుడికి అందుబాటులో లేని అడ్వాన్సులు. కానీ లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టె శ్రీనివాస్ సుమారు రూ.4 కోట్ల వ్యయంతో సెంట్రల్ ఎయిర్ కండీషన్డ్ కళ్యాణ మండపాన్ని అన్నవరం దేవస్థానంలో ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మండపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే తమ పిల్లల పెళ్లిళ్లు చేసుకోవచ్చు. ఇది పేద వారి కోసం పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక. అన్నవరం దేవస్థానంలో …

Read More »

రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో వైఎస్సార్ రైతు భరోసాయాత్రలు : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు భరోసా కేంద్రాల విధివిధానాలు, సీఎం యాప్ పనితీరు, ఈ–క్రాపింగ్ తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో వైఎస్సార్ రైతు భరోసాయాత్రల ప్రధాన ఉద్దేశ్యమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వివరించారు. శుక్రవారం  ఆయన విజయవాడ రోడ్డులోని మూడు స్థంబాల కూడలిలో రైతు భరోసా వాహనానికి పచ్చ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాకు …

Read More »

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ ‘క్లాప్‌’ కార్యక్రమంపైనా సీఎం సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 124 మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో 1.2 కోట్ల బిన్‌లు, 40 లక్షల ఇళ్ళకు ఇంటికి మూడు చొప్పున బిన్‌లు, గ్రీన్, బ్లూ, రెడ్‌ కలర్స్‌లో బిన్‌లు, వ్యర్ధాల(చెత్త) సేకరణకు 4868 వాహనాలు, ఇందులో 1771 ఎలక్ట్రిక్‌ వాహనాలు, మొదటి ఫేజ్‌లో 3097 వాహనాలు, 225 గార్బేజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ స్టేషన్లు, సేకరించిన వ్యర్ధాలను వివిధ విధానాల్లో ట్రీట్‌చేసేలా ఏర్పాట్లు, సేకరించిన వ్యర్ధాల్లో 55 …

Read More »

కె డి.సి.ఈ.బి. చైర్మన్ గా తన్నీరు నాగేశ్వర రావు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కెడీసీసీబీని ఉన్నత స్థానంలో నిలిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారనే నమ్మకం నూతన చైర్మన్ తన్నీరు నాగేశ్వరావుపై ఉందనీ రాష్ట్ర సమా చార, రవాణా, శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిలు విశ్వాసం వ్యక్తం చేశారు. సహకార కేంద్ర బ్యాంక్ ,కృష్ణా జిల్లా చైర్మన్ గా మచిలీపట్నంలో శుక్రవారం మధ్యాహ్నం తన్నీరు నాగేశ్వరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రుణ సౌకర్యం విస్తృత పర్చుతానని …

Read More »

మచిలీపట్నం డెప్యూటీ మేయర్ – 2 గా లంకా సూరిబాబు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగర పాలక సంస్థ డెప్యూటీ మేయర్ గా లంకా సూరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ డెప్యూటీ మేయర్ – 2 ఎన్నుకోనే కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక సమావేశం శుక్రవారం మధ్యాహ్నం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు. మునిసిపల్ కౌన్సిల్ హాల్ లో కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత డిప్యూటీ మేయర్ -2 ఎన్నిక కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించారు. ఈ ప్రక్రియలో లంకా సూరిబాబు డిప్యూటీ మేయర్ -2 గా …

Read More »

మానవులను సాధనాలుగా మలచుకొని తన లక్ష్యాన్ని పూర్తి చేసేవారే భగవంతుడు : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అల్లా ఆజ్ఞ ప్రకారం ఎన్నో ఆశ్చర్యకరమైన పనులు జరుగుతూనే ఉంటాయని మానవులను తన సాధనాలుగా మలచుకొని అనుకొన్న లక్ష్యాన్ని పూర్తి చేసుకొంటారని అందుకు ప్రత్యక్ష ఉదాహరణ బీ బీ ఫాతిమా జహ్రా ఆస్తానా పంజా నిలుస్తుందని రాష్ట్ర, రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. శుక్రవారం  ఆయన స్థానిక 26 వ డివిజన్ ( జవ్వారుపేట ) లోని 400 ఏళ్ళ నాటి పురాతన బీబీ ఫాతిమా …

Read More »

అక్రిడేటెడ్ జర్నలిస్టులందరూ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ప్రీమియం చెల్లించాలి…

– కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా క్రొత్తగా అక్రిడిటేషన్ కార్డులు పొందిన వర్కింగ్ జర్నలిస్టులందరూ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ప్రీమియం రూ. 1250/- cfms.ap వెబ్ సైట్ ద్వారా క్రింద తెలిపిన పద్దుకు చెల్లించి ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ను 2021-22 …

Read More »