-జిల్లాను అన్ని శాఖల సమన్వయంతో ప్రగతి పథంలో నడిపిస్తాం: జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి జిల్లాలో కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని, జిల్లాను అన్ని శాఖల సమన్వయంతో ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. నేటి బుధవారం స్థానిక కలెక్టరేట్ చేరుకున్న లక్ష్మీ షా గారికి అర్చకులు వేద మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలుకగా, జెసి శుభం బన్సల్, …
Read More »Telangana
డ్రైవర్లు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి- డీటీసీ యం పురేంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దృష్టి లోపాలు కలిగిన డ్రైవరులకు చూపు మందగించడం, దూరపు వాహనాలను గమనించలేకపోవడం వంటి జరుగుతాయని, ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి కంటి పరీక్షలను చేయించుకోవాలని డిటిసి యం పురేంద్ర అన్నారు. స్థానిక బందరు రోడ్డులోని డీటీసీ కార్యాలయంలో బుధవారంనాడు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాన్ని డిటిసి యం పురేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా డీటీసీ యం పురేంద్ర మాట్లాడుతూ డ్రైవర్లు కంటి చూపు మందగించినప్పటికి కొంతమంది …
Read More »విశాఖ సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్లో సరికొత్త ఆలోచనలు రేకెత్తింపజేసిన సైన్స్ ఫెయిర్
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం బీహెచ్ఈఎల్ లోని సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్లో గత మూడు రోజులపాటు జరిగిన కోరమాండల్ ఇంట్రా స్కూల్ సైన్స్ ఫెయిర్ చిన్నారులలో సరికొత్త ఆలోచనలను రేకెత్తింపచేసింది. విద్యార్థినీ విద్యార్థులు వినూత్న రీతిలో సూక్ష్మంగా రూపొందించిన వివిధ నమూనాలు, ప్రదర్శనయ్యాయి. ఎంతో ఉత్సాహంగా చిన్నారులు విభిన్న శ్రేణి ప్రాజెక్టుల ద్వారా తమ శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందించడంతోపాటు సైన్స్ మరియు ఆవిష్కరణ పట్ల వారిలో సరికొత్త అభిరుచిని నెలపొందించడానికి ఈ కార్యక్రమం వేదికగా మారింది …
Read More »టెక్స్‌టైల్స్ టెక్నాలజీ కోర్సులకు ఉజ్వల భవిష్యత్తు
-చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత -గుంటూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్స్‌టైల్స్ టెక్నాలజీ లో అవగాహనా సదస్సు -పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ద్వారా జౌళి రంగంలోకి అడుగిడే సువర్ణ అవకాశం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : టెక్స్‌టైల్స్ టెక్నాలజీ కోర్సులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని విధ్యార్ధులు ఈ కోర్సులను ఎంచుకోవటం ద్వారా తక్షణం ఉపాధి పొందవచ్చని చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత తెలిపారు. టెక్స్‌టైల్స్ టెక్నాలజీ విభాగంలోని పాలిటెక్నిక్ కోర్సులపై అవగాహన కల్పించే క్రమంలో చేనేత, జౌళి శాఖ బుధవారం …
Read More »రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
-తుది ఓటరు జాబితా పై వొచ్చిన అభ్యంతరాలు పరిష్కరించడం జరుగుతుంది -నియోజక వర్గ స్థాయి చర్యలు తీసుకోవడం జరుగుతోంది -డి ఆర్వో జి. నరసింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 22 న ప్రకటించిన 2024 ఎస్ యస్ ఆర్ తుది ఓటరు జాబితా లో దొర్లిన తప్పులను సరిదిద్ది చర్యలు తీసుకోవడం జరుగుతోందని జీల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లో రాజకీయ పార్టీలతో డి ఆర్వో జి. నరసింహులు సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »ఘనంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్రా జిల్లా స్థాయి క్రీడలు
-ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్, ఎంపి, క్రీడా అంబాసిడర్లు -బ్యాట్ పట్టి ఆకట్టుకున్న కలక్టర్, జేసీ, మునిసిపల్ కమిషనర్ -రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ఆధునిక కాలంలో యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని , తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రోత్సహించడం చాలా ముఖ్యం అని కలక్టర్ కే. మాధవీలత, ఎంపి మార్గనీ భరత్ రామ్ లు పేర్కొన్నారు. స్ధానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆడుదాం ఆంధ్రా జిల్లా స్థాయి క్రీడలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సంధర్భంగా జిల్లా …
Read More »APERC to fully Support Mission LiFE (Life Style for Environment) APERC Chairman Justice CV Nagarjuna Reddy
-Mission LiFE, integral to India’s NDCs, aims to mobilize one billion globally towards a nature-harmonious lifestyle -BEE, GOI is actively promoting “Mission LiFE” initiative in Andhra Pradesh -Mission LiFE has set ambitious targets for 2022-2028, envisioning the transformation of villages and urban local bodies into environmentally friendly entities -APERC Chairman unveiled a compelling poster on Mission LiFE, highlighting its core …
Read More »రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను అమరావతి సచివాలయం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులకు వివరించిన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, బి.సి.సంక్షేమం మరియు సినిమాటోగ్రపీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ… 1. మహిళా సాధికారతకు, స్వావలంబనకు వెన్నుదన్నుగా నిలుస్తూ… ఫిబ్రవరి 16 నుంచి నాలుగో విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమం. ఫిబ్రవరి 16 నుంచి రెండు వారాలపాటు జరగనున్న …
Read More »ప్రజలకు త్రాగునీరు సరఫరాలో లోపం లేకుండా చూడండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు కమిషనర్ స్వప్నిల్ దీన్కర్ బుధవారం 63వ డివిజన్ రాజీవ్ నగర్ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నీటి సమస్య నిలుకొన్న ఆ ప్రాంతాలలో సమస్య పరిష్కారనికై వేయబడిన నూతన బోర్ వెల్స్ ను పరిశీలించి యుద్ద ప్రాతపదికన నిర్మాణం పూర్తి చేసి నీటి సమస్యను సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రాజీవ్ నగర్ ప్రధాన రహదారిపై గల ప్రధాన కాలువ నిర్మాణo చేపట్టడానికి ప్రభుత్వ వారి అనుమతి …
Read More »ఫిబ్రవరి ఒకటవ తేదీ గురువారం ఉదయం నుండే కార్డుదారులకు నిత్యవసర సరుకులు పంపిణీ
-జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు సరఫరా చేసే నిత్యవసర సరుకులు పంపిణీ ఫిబ్రవరి ఒకటో తేదీ గురువారం ఉదయం 7 గంటల నుండి ప్రారంభించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ తెలిపారు. మొబైల్ డిస్పర్సింగ్ యూనిట్ ( ఎండియు) ఆపరేటర్లు గురువారం నుండి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం,బియ్యం,పంచదార వంటి నిత్యవసర సరుకులను ఫిబ్రవరి ఒకటో తేదీ గురువారం …
Read More »