Breaking News

Telangana

జిల్లాలో రైల్వేలకు సంబంధించి ఆయా ప్రాజెక్టు పనులు ముందుకు సాగేందుకు అనుకూలమైన చర్యలు వేగవంతం చేయాలి… : కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాలో దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ జె. నివాస్ రైల్వే, రెవెన్యూ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవిలత, విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్, నూజివీడు ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి, రైల్వేస్ ఇంజినీర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో రైల్వేలకు సంబంధించి ఆయా ప్రాజెక్టు పనులు ముందుకు సాగేందుకు అనుకూలమైన …

Read More »

పారిశుధ్య నిర్వహణకై 500 వీల్ బర్రోస్ కొనుగోలు, మైక్రో పాకెట్ ఆధారంగా డివిజన్ల కేటాయింపు… : మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తుమ్మలపల్లి వారి కళా క్షేత్రం వద్ద ప్రజారోగ్య శాఖా ఏర్పాటు చేసిన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పాల్గొన్నారు. నగరంలో పారిశుధ్య నిర్వహణలో భాగంగా నివాసాల నుండి చెత్త సేకరణకై సుమారు 50 లక్షల విలువలతో నూతనంగా కొనుగోలు చేసిన 500 వీల్ బేరర్స్ లను ప్రారంభించి మైక్రో పాకెట్ ఆధారంగా డివిజన్ లలోని పారిశుధ్య సిబ్బందికి అందించారు. ఈ సందర్బంలో వారు మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య నిర్వహణ విధానమును …

Read More »

బెజవాడ ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్ర… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-నగర ప్రజలకు చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి -గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం పట్ల చంద్రబాబు విద్వేష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు  అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా వాంబే కాలనీలోని ఏ బ్లాక్ లో డివిజన్ కోఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి ఆయన పర్యటించారు. స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు భరోసాని కల్పిస్తూ.. ఆరో రోజు పర్యటన సాగింది. అర్హత …

Read More »

సచివాలయ హెల్త్ సెక్రెటరీ లకు మెడికల్ కిట్స్ పంపిణి చేసిన మేయర్, కమిషనర్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ అద్వర్యంలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రం నందు ఏర్పాటు చేసిన సచివాలయ హెల్త్ సెక్రెటరీ లకు మెడికల్ కిట్స్ పంపిణి కార్యక్రమములో నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, మేయర్ రాయన భాగ్య లక్ష్మి పాల్గొన్నారు. వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్ మరియు ఆరోగ్య శ్రీ ద్వారా సిబ్బందికి మెడికల్ ఎక్యూప్ మెంట్స్ అందజేసారు. నగర పరిధిలోని 286 సచివాలయంలో గల హెల్త్ సెక్రెటరీ లకు వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్ వారు అందించిన …

Read More »

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే … 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే ఆర్కే మంగళవారం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని పరిశీలించారు. నిన్న గాలిగోపురం నుండి పెచ్చులు ఊడి పడ్డాయని తెలుసుకుని ఎమ్మెల్యే దేవాదాయశాఖ అధికారులతో, ట్రస్ట్ బోర్డ్ సభ్యులతో, MTMC అధికారులతో కలిసి దేవస్థానాన్ని, దేవస్తానం చుట్టూ ప్రక్కల ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. పెచ్చులు ఊడి పడిన తీరును దేవస్థాన EOని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఈ దేవస్థానం దాదాపు 200 వందల సంవత్సరాల క్రితం రాజా శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి …

Read More »

కనెక్ట్ ఆంధ్రా ఐ.ఓ.సి ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో రూ.25 లక్షల విలువ మెడికల్ కిట్స్ వితరణ…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కనెక్ట్ ఆంధ్రా ఐ.ఓ.సి ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో రూ.25 లక్షల విలువ మెడికల్ కిట్స్ వితరణ ఇవ్వడం అభినందించదగ్గ విషయమని తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం.గురుమూర్తి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక రుయా ఆసుపత్రి భువన విజయం ఆడిటోరియంలో సి.ఇ. ఓ, కొటేశ్వరమ్మ ఐ.ఆర్.ఎస్., జి.ఎం. స్వామినాథన్ లు ఈ వితరణ కార్యక్రమం ఎం.పి. చేతుల మీదుగా రుయా ఆసుపత్రికి అందించారు. ఎం.పి. మాట్లాడుతూ అభ్యర్థన మేరకు ఐ.ఓ.సి. కనెక్ట్ ఆంధ్రా స్పందించి నేడు రూ.25 లక్షల విలువ …

Read More »

ప్రణాళిక బద్దంగా కడప నగరాన్ని అభివృద్ధి చేస్తాం…

-కడపను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాం… -రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా…. -కడప నగరంలోని స్థానిక 28వ డివిజన్ లో రూ.28 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన… కడప, నేటి పత్రిక ప్రజావార్త : ప్రణాళిక బద్దంగా కడపను అభివృద్ధి చేసి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని 28వ డివిజన్ లోని సయ్యద్ సాహెబ్ వీధి పరిధిలో… నగర మేయర్ కె.సురేష్ బాబుతో కలిసి.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా.. 14 …

Read More »

గురుజాడకు ఘన నివాళి అర్పించిన గవర్నర్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రముఖ తెలుగు కవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని పురస్కరించుకుని ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ నాటి సామాజిక సమస్యలపై గురజాడ అప్పారావు సాహిత్యం ఆలంబనగా గళం విప్పారన్నారు. ప్రసిద్ధ తెలుగు నాటక రచయితగా, కవిగా ఆయన సేవలు నిరుపమానమని, 1892లో గురజాడ రాసిన కన్యాశుల్కం నాటిక విమర్శకుల ప్రశంసలు అందుకుందన్నారు. ఇది తెలుగు భాషలో గొప్ప నాటకంగా గుర్తించబడి నేటికీ అజరామరంగా ప్రదర్శించబడుతూనే ఉందన్నారు. …

Read More »

వైసీపీ నేతల రౌడియిజం పరాకాష్టకు చేరింది…

-అమరావతి దళిత జేఏసీ నేత పులి చిన్నాపై వైసీపీ దాడి దుర్మార్గం -వైసీపీ అరాచకాలు ఇన్నాళ్లు భరించాం.. ఇక నుంచి సహించం -చట్ట వ్యతిరేకంగా పనిచేసిన పోలీసుల్ని చట్టపరంగా శిక్షించే వరకు వదలిపెట్టం -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు -టైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దళిత జేఏసీ నేతకు బాబు పరామర్శ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైసీపీ అరాచాకాలు పరాకాష్టకు చేరాయని, ఇన్నాళ్లు మౌనంగా భరించామని ఇక నుంచి సహించబోమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష్యులు నారా చంద్రబాబు …

Read More »

వాణిజ్య ఉత్సవ్-2021 ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి…

-విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలి… -జిల్లా కలెక్టరు జె. నివాస్, సిపి బత్తిన శ్రీనివాసులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాణిజ్య ఉత్పత్తులను మెరుగుపరిచి ఎ గువుతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో విజయవాడలో నిర్వహించనున్న వాణిజ్య ఉత్సవ్ – 2021 ను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. ఈనెల 21, 22 తేదీలలో యస్ యస్ కన్వెన్షన్ వేదికగా రెండు రోజులు పాటు జరిగే ఈ ఉత్సవ్ లో దుబాయ్, లండన్, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, పశ్చిమ …

Read More »