Breaking News

Daily Archives: June 7, 2024

జి.ఓ.నెం.117ను రద్దు చేసి విద్యారంగంలో నెలకొన్న అస్తవ్యస్తతలను సరిదిద్దాలి…

-ఏపిటియఫ్ రాష్ట్ర కార్యవర్గం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఏపిటియఫ్ రాష్ట్ర కార్యాలయం చెన్నుపాటి-సింగరాజు భవన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం చెన్నుపాటి మంజుల అధ్యక్షతన జరిగింది. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేసిందని, ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడికి గురిచేసిందని, విద్యారంగంలో సి.బి.యస్.ఈ, ఐ.బి. వంటి విధానాలను ప్రవేశపెట్టి గందరగోళానికి గురిచేసిందని, ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టకుండా ఉపాధ్యాయులపై పనిభారాన్ని మోపిందని, పాఠశాలల విలీన ప్రక్రియతో ప్రాథమిక పాఠశాలల ఉసురుతీసిందనీ, 117 జి.ఓ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను తొలగించిందనీ, కొత్త ప్రభుత్వం ఈ పరిస్థితులన్నింటినీ …

Read More »

ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి సహకరించిన టీం కృష్ణా కు అభినందనలు

-జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి ఎన్నికల అధికారులు, సిబ్బంది టీం స్పిరిట్ తో పనిచేశారని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రశంసించారు. 2024 సాధారణ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించిన సందర్భంగా ఎన్నికల అధికారులు, సిబ్బందికి అభినందన సభ శుక్రవారం జడ్పీ కన్వెన్షన్ హాల్లో జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా, రీపోలింగ్ లేకుండా ఎంతో సమర్థవంతంగా …

Read More »

ఏపిలో కూటమి ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం… : ఆర్టీసి.ఇ.యు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ఆద్వర్యంలో ఏర్పడుతున్న ప్రభుత్వానికి ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్రకమిటి తరుపున పూర్తిగా సహకరిస్తామని, ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గా బాద్యతలు నాలుగవసారి స్వికరిస్తున్న నారా చంధ్రబాబునాయుడుకి, కూటమి నాయకులు పవన్ కల్యాణ్ కి, పురందరీశ్వరికి శుక్రవారం ఒక ప్రకటన ద్వారా ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్య రాష్ట్రకమిటి తరుపున శుభాకాంక్షలు తెలియజేసారు. అలాగే కొత్తగా ఏర్పడుతున్న ఈ …

Read More »

చంద్రబాబు ప్రమాణస్వీకారం ముహూర్తం ఖరారు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉ.11.27 గంటలకు ప్రమాణం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. CBN ప్రమాణస్వీకారానికి నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు రానున్నారు.

Read More »

నరేంద్ర మోదీ కి మద్దతు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాం

-మోదీ సూచనలు, సలహాలను ఆంధ్రప్రదేశ్ పాలనలోనూ తీసుకుంటాం -రాష్ట్రానికి ఎన్టీయే ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉండాలని ఆకాంక్షిస్తున్నాను -ఢిల్లీలో జరిగిన ఎన్టీయే పక్ష నాయకుడి ఎన్నిక కార్యక్రమంలో మాట్లాడిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘భారత జాతి యావత్తుకు స్ఫూర్తి అందించిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు కామాఖ్య నుంచి ద్వారక వరకు ప్రతి ఒక్కరిలో గొప్ప జాతి సమైక్యతను నింపిన ప్రధాని. దేశాన్ని ప్రపంచ దేశాల ముందు …

Read More »

చర్చనీయాంశంగా రెడ్ బుక్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ విషయం ఏపీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంలో లోకేష్ ది కీలక పాత్ర కాబోతోంది. రెడ్ బుక్ బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది అధికారులు తమ పరిధి, స్థాయి మరిచి వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు పెట్టడంతోపాటు అక్రమ అరెస్ట్ల పర్వాన్ని యథేచ్చగా కొనసాగించారు. వారిని వదిలిపెట్టేది లేదని, అందరి పేర్లు రెడ్ బుక్ …

Read More »

వైసీపీ కవ్వింపు చర్యలపై టీడీపీ క్యాడర్ సంయమనం పాటించాలి : చంద్రబాబు నాయుడు 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడక్కడా జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయంపై ఆయన పార్టీ నేతల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలుగు దేశం పార్టీ క్యాడర్ కు చంద్రబాబు సూచించారు. నాయకులు సైతం అలెర్ట్ గా ఉండి….ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా …

Read More »

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.నీరబ్ కుమార్ ప్రసాద్ ను సిఎస్ గా నియమిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జిఓఆర్టి సంఖ్య 1034 ద్వారా ఆదేశాలు జారీ చేయగా శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సిఎస్ చాంబరులో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు మరియు విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశిస్సుల మధ్య నీరబ్ …

Read More »

డా.కెఎస్.జవహర్ రెడ్డికి ఈనెల 27 వరకూ ఆర్జిత సెలవు మంజూరు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డికి ఈనెల 7వ తేదీ నుండి 27వ తేదీ వరకూ అనగా 21 రోజుల పాటు ఆర్జిత సెలవు(earned leave) మంజూరు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ జిఓఆర్టీ సంఖ్య 1058 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆర్జిత సెలవు మంజూరు చేయాల్సిందిగా గురువారం ప్రభుత్వానికి దరఖాస్తు చేసిన నేపధ్యంలో ఆమేరకు అఖిల భారత లీవ్ రూల్స్ 1955 …

Read More »

నూతన ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందిద్దాం.

-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతన ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించి జిల్లాకు మరింత వన్నె తెచ్చేందుకు కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అన్నారు. ఏపీఎన్జీవో అసోసియేషన్ నగర శాఖలో ఖాళీ అయిన పదవులకు కో ఆప్షన్ పద్దతిలో ఎన్నిక కాబడిన నగర శాఖ అద్యక్షులు సివిఆర్ ప్రసాద్, సహ అధ్యక్షులు బి. రాజశేఖర్, ఉపాధ్యక్షులు ఎం. శ్రీనివాసరావు, కార్యదర్శి షేక్ నజీరుద్దీన్, కోశాధికారి డిఎస్ ఎన్ శ్రీనివాస్ లు …

Read More »