Breaking News

ఏపిలో కూటమి ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం… : ఆర్టీసి.ఇ.యు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ఆద్వర్యంలో ఏర్పడుతున్న ప్రభుత్వానికి ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్రకమిటి తరుపున పూర్తిగా సహకరిస్తామని, ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గా బాద్యతలు నాలుగవసారి స్వికరిస్తున్న నారా చంధ్రబాబునాయుడుకి, కూటమి నాయకులు పవన్ కల్యాణ్ కి, పురందరీశ్వరికి శుక్రవారం ఒక ప్రకటన ద్వారా ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్య రాష్ట్రకమిటి తరుపున శుభాకాంక్షలు తెలియజేసారు. అలాగే కొత్తగా ఏర్పడుతున్న ఈ ప్రభుత్వం ప్రజారవాణా(ఆర్టీసి)ని ప్రజలకు మరింత చేరువ చేసేలా చర్యలు తీసుకోవాలని, అక్రమరవాణాని అరికట్టి ఆర్టీసిని లాబాల బాటలో నడిపించేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసి బస్సులలో ఉచిత రవాణాసౌకర్యం కల్పిస్తున్నందున ప్రస్తుతం ఉన్న బస్సులు చాలవు కాబట్టి బస్సులు సంఖ్యను పెంచేందుకు కూడా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *