Breaking News

ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి సహకరించిన టీం కృష్ణా కు అభినందనలు

-జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి ఎన్నికల అధికారులు, సిబ్బంది టీం స్పిరిట్ తో పనిచేశారని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రశంసించారు. 2024 సాధారణ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించిన సందర్భంగా ఎన్నికల అధికారులు, సిబ్బందికి అభినందన సభ శుక్రవారం జడ్పీ కన్వెన్షన్ హాల్లో జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా, రీపోలింగ్ లేకుండా ఎంతో సమర్థవంతంగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించిన ఎన్నికల అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వివిధ ఎన్నికల అంశాలకు సంబంధించి ఏర్పాటు చేసిన నోడల్ అధికారుల బృందం ఎంతో చక్కగా పని చేసిందన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా శాంతియుతంగా నిర్వహించుటకు సహకరించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, వారి పోలీస్ బృందాన్ని కలెక్టర్ అభినందించి ఘనంగా సత్కరించారు.

ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడంలో మీడియా చక్కని పాత్ర పోషించిందని, ఈ సందర్భంగా మీడియా మిత్రులకు అభినందనలు అంటూ కలెక్టర్ ప్రశంసించారు.

జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ తమ సంపూర్ణ సహకారాన్ని అందించారన్నారు. తొలుత జాయింట్ కలెక్టర్, గన్నవరం రిటర్నింగ్ అధికారి గీతాంజలి శర్మ, మచిలీపట్నం, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఆర్డీవోలు ఏం. వాణి, పి. పద్మావతి, డి. రాజు, అవనిగడ్డ ఆర్ఓ బాలసుబ్రమణ్యం, పామర్రు ఆర్వో శ్రీదేవి, 16 ఎన్నికల అంశాలపై నోడల్ అధికారులు ఎన్నికల నిర్వహణలో వారి అనుభవాలను సమావేశంలో వివరించారు. అనంతరం ఎన్నికల అధికారులు సిబ్బందిని కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ శాలువ, మేమెంటోలతో సత్కరించారు. ఎన్నికల అధికారులు సిబ్బందికి దిశా నిర్దేశం చేసి, ఎన్నికల ప్రక్రియ విజయవంతం గావించడంలో ప్రధాన పాత్ర పోషించిన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ను ఘనంగా సత్కరించారు. తొలుత డిఆర్వో కె. చంద్రశేఖరరావు ఎన్నికల నిర్వహణలో అధికారుల, సిబ్బంది పాత్ర, సమస్యలను అధిగమించిన తీరు సోదాహరణంగా వివరించారు. కలెక్టరేట్ ఎన్నికల విభాగం సమన్వయ అధికారి దుర్గా కిషోర్ వందన సమర్పణ చేశారు.

ఈ సమావేశంలో ఏ ఎస్ పి లు జి. వెంకటేశ్వరరావు, ఎస్ వి డి ప్రసాద్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఏ ఈ ఆర్ వో లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *