Breaking News

Daily Archives: June 16, 2024

కేన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు

-రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎయిమ్స్ తరహాలో మెరుగైన వైద్య సేవలు అందజేసే విధంగా చర్యలు తీసుకుంటామని, అందుకు అవసరమైన మౌలిక వసతులను మెరుగు పర్చడంతో పాటు …

Read More »

19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ నెల 19వ తేదీ, బుధవారం నాడు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్ కి కేటాయించిన సంగతి విదితమే. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న శాఖలను కేటాయించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Read More »

ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బక్రీద్ శుభాకాంక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్యఉద్దేశం అని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమన్నది బక్రీద్ సారాంశమని, పండుగ సందర్భంగా ఖుర్బానీ ద్వారా పేదలకు ఆహారం వితరణగా ఇస్తారన్నారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగగుణాన్ని ప్రబోధించే బక్రీద్ పండుగని స్ఫూర్తిగా తీసుకుని సమైక్యతను, సమానత్వాన్ని …

Read More »

హజ్ తో ముగియనున్న బక్రీద్ పండుగ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హజ్ అనేది సౌదీ అరేబియాలోని మక్కాకు చెందిన వార్షిక ఇస్లామిక్ తీర్థయాత్ర. ప్రతి ముస్లిం వ్యక్తి ఇది జీవితకాలంలో ఒకసారైనా చేయాల్సి ఉంటుంది .కొంతమంది ముస్లింలు ఒకటి కంటే ఎక్కువ సార్లు కూడా ప్రయాణం చేస్తారు. ఆర్థికంగా, శారీరకంగా ధృడంగా ఉన్న వాళ్ళు హజ్ యాత్ర చేస్తారు. విశ్వాసం, ప్రార్థన, క్షమాపణ, ఉపవాసం ప్రాముఖ్యతను యాత్ర తెలియజేస్తుంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ నెలలో ఈ యాత్ర చేపడతారు. ఐదు రోజుల పాటు సాగుతుంది. బక్రీద్ పండుగతో …

Read More »

ప్రశాంత వాతావరణంలో ముగిసిన యు పి ఎస్ సి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు- 2024

-ఉదయం 49.44 శాతం , మధ్యాహ్నం 49.31 శాతం హాజరు: జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ఆదివారం జరిగిన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ- 2024 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆదివారము ఉదయం 9:30 నుండి 11:30 మధ్యాహ్నం 2:30 నుండి 4:30 గంటల వరకు రెండు సెషన్ల లో పరీక్ష నిర్వహణ జరిగిందనీ, తిరుపతిలో నిర్వహించిన 11 పరీక్షా కేంద్రాల లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలకు …

Read More »

మాజీ మంత్రి జోగి నివాసంపై రాళ్లదాడి

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం మధ్యాహ్నం రాళ్లతో దాడికి పాల్పడ్డారు. కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు జోగి రమేష్ నివాసంపైకి రాళ్లు విసురుతుండగా అక్కడే ఉన్న కానిస్టేబుల్ వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్ ను పట్టించుకోని వ్యక్తులు జోగి నివాసంపై రాళ్లు విసిరి కారులో పరారయ్యారు. సేకరించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల …

Read More »

రెండు నెలల్లో పట్టాలపైకి వందే భారత్ స్లీపర్ క్లాస్ రైలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రెండు నెలల్లో పట్టాల పైకి వందేభారత్ స్లీపర్ క్లాస్ రైలు వందే భారత్ చైర్ రైళ్లకు కొనసాగింపు గా రానున్న వందేభారత్ స్లీపర్ క్లాస్ రైలు ట్రయల్ రన్ మరో రెండు నెలల్లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రైళ్లను ఇప్పటికే తయారైనట్లు సమాచారం. న్యూఢిల్లీలో వందే భారత్ స్లీపర్ రైలును నడపాలని ప్రజల నుంచి డిమాండ్లు వచ్చినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వందే భారత్ రైలు మొదటి స్వదేశీ సెమీ హైస్పీడ్ …

Read More »

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దుర్గగుడి దివ్య క్షేత్ర అభివృద్ధికి కృషి చేస్తా… : ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ ఎమ్మెల్యే వై సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర మైన్స్ జియాలజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కలిసారు. అలాగే దుర్గగుడి ఈవో రామారావు కూడ ఎమ్మెల్యే సుజనా చౌదరిని కలసి అమ్మవారి చిత్రపటాన్ని ఇచ్చి సత్కరించగా వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతు ఇంద్ర కీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం వారికి సేవ చేసే అవకాశం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల …

Read More »

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి… : ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రజల కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పై ఉందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఒక్క సారిగా భారీ వర్షం పడటంతో వెనువెంటనే సుజనా చౌదరి చరవాణి ద్వారా జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నికల్ దినకరన్ తో మాట్లాడారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార …

Read More »

సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపిన ‘కురుబ సంఘం’

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర కురుబ తరుపున అభినందనలు తెలుపుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కురుబ సంఘ నాయకులు తెలిపారు. అదివారం గాంధీనగర్‌ని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎపి రాష్ట్ర కురుబ సంఘ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ కురుబ కులాన్ని గుర్తించి హిందూపురం పార్లమెంటు స్థానాన్ని వీకే పార్థసారథికి, కర్నూల్‌ పార్లమెంటు స్థానాన్ని పంచలింగాల నాగరాజుకి, పెనుగొండ శాసనసభ …

Read More »