అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్యఉద్దేశం అని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమన్నది బక్రీద్ సారాంశమని, పండుగ సందర్భంగా ఖుర్బానీ ద్వారా పేదలకు ఆహారం వితరణగా ఇస్తారన్నారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగగుణాన్ని ప్రబోధించే బక్రీద్ పండుగని స్ఫూర్తిగా తీసుకుని సమైక్యతను, సమానత్వాన్ని సాధిద్దాం అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News