Breaking News

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దుర్గగుడి దివ్య క్షేత్ర అభివృద్ధికి కృషి చేస్తా… : ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ ఎమ్మెల్యే వై సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర మైన్స్ జియాలజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కలిసారు. అలాగే దుర్గగుడి ఈవో రామారావు కూడ ఎమ్మెల్యే సుజనా చౌదరిని కలసి అమ్మవారి చిత్రపటాన్ని ఇచ్చి సత్కరించగా వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతు ఇంద్ర కీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం వారికి సేవ చేసే అవకాశం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దుర్గగుడి దివ్య క్షేత్రాన్ని మరింత అభివృద్ధి కృషి చేస్తామన్నారు. భక్తులకు విస్తృతమైన సదుపాయాలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *