-ఎంఎల్ఎ సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వస్త్రలతలోని సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి అండగా ఉంటానని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. ది క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సోమవారం ఎమ్మెల్యే సుజనా పాల్గొన్నారు. అసోసియేషన్ మధ్య అద్దె బకాయిల అంశం లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించి సలహాలు సూచనలను స్వీకరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో చందాలు, దందాలు లేకుండా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చని సుజనా హామీ ఇచ్చారు. వస్త్రలతకు సంబంధించిన సమస్యలు, కాంప్లెక్స్ …
Read More »Daily Archives: November 18, 2024
డిపాజిటర్ల ఆర్థిక ప్రయోజనాలు కాపాడాలి
-ఎం ఎల్ ఎ సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల రిజర్వ్ బ్యాంకు ఆంక్షలు విధించిన దుర్గ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సోమవారం సందర్శించారు. డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి , సి ఈ ఒ బంకా శ్రీనివాస్ తో కలిసి చర్చించారు. బ్యాంకు లోని అవకతవకల గురించి, డిపాజిటర్లతో, బ్యాంకు సిబ్బందితో మాట్లాడి బ్యాంకు ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నారు. డిపాజిట్లను విత్ డ్రా చేసుకునే అవకాశం …
Read More »పశ్చిమ లో ఎమ్మెల్యే సుజనా చౌదరి సుడిగాలి పర్యటన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) సోమవారం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. చిట్టినగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సుజనా చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వసతులను ఆయన పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై అరా తీసి రికార్డులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయవలసిన అభివృద్ధి గురించి చర్చించారు.అనంతరం 151,146 సచివాలయాలను సందర్శించి వెల్ఫేర్ సెక్రెటరీ, విఆర్ఓ, అడ్మిన్ సిబ్బందిని సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవలను …
Read More »సుజనా చౌదరి ఔదార్యం
-మృతుల కుటుంబానికి ఆర్థిక సాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు కార్యాలయ సిబ్బంది ఆర్థిక సాయం చేశారు.38 వ డివిజన్ కుమ్మరిపాలెం కు చెందిన టిడిపి యూనిట్ ఇంచార్జ్ కంభంపాటి దుర్గారావు 63 కేదారేశ్వర పేటకు చెందిన లోకేష్ 17 ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారికి ఆర్థిక సాయం అందజేయాలని 38వ డివిజన్ టిడిపి అధ్యక్షురాలు పితాని పద్మ , టిడిపి నాయకులు రాఘవేంద్రరావు …
Read More »పట్టాభి రామ్ వైసిపి దుర్మార్గాలను ధీటుగా ఎదుర్కొన్నాడు
-ఎం ఎల్ ఎ సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి ) కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ తో కలిసి అభినందనలు తెలిపారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం లో సోమవారం నిర్వహించిన పట్టాభిరామ్ అభినందన సభలో సుజనా చౌదరి పాల్గోన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వైసిపి ఐదేళ్ల పాలనలో ప్రజా ప్రతినిధులకు వాక్ స్వాతంత్ర్యం లేకుండా చేశారన్నారు.వైసిపి …
Read More »ఏపి మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన చిల్లపల్లి శ్రీనివాసరావు
-వెలువెత్తిన అభిమానం -భారీగా తరలివచ్చిన జనసైనికులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ చిల్లపల్లి శ్రీనివాసరావు ఏపి మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ గా మంగళగిరి ఆటోనగర్ లోని APMSIDC కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. చిల్లపల్లి శ్రీనివాసరావు నివాసం వద్ద నుంచి పాదయాత్ర గా అంబేద్కర్ సెంటర్ కు చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి మంగళగిరి లోని ఏపి మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యాలయం వరకు భారీ …
Read More »ఇళ్ల స్థలాల కోసం సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సామూహిక అర్జీలను సమర్పించిన పేదలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల చొప్పున మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర వ్యాప్తి పిలుపుమేరకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో గ్రామ/వార్డు సచివాలయాల వద్ద పేదలు సామూహిక అర్జీలు సమర్పించి, చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు జయప్రదంగా జరిగాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు; బాపట్ల జిల్లా …
Read More »నవంబర్ 18 నుండి డిసెంబర్ 2, 2024 వరకు పీఎం స్వానిధి క్యాంపెయిన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విధి వ్యాపారస్తులను ఆదుకునేందుకు, ఆర్థిక స్థితిని పెంచేందుకు కల్పించే ప్రధానమంత్రి స్వానిధి పథకం క్యాంపెయిన్ 15 రోజులు నిర్వహించి వీధి వ్యాపారస్తులను బలోపేతం చేయాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ మీద నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ జాయింట్ సెక్రెటరీ …
Read More »సత్వర పరిష్కారాలను అందించండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందే ప్రతి ఫిర్యాదుకు సత్వర పరిష్కారాలు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నగర కమిషనర్ సోమవారం ఉదయం 10 గంటల నుండి నిర్వహించారు. నగర పరిధిలో గల వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తూ ఆ సమస్య …
Read More »మ్యాప్ల ఆధారంగా డ్రైన్లు శుభ్రపరచండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మ్యాప్ ల ఆధారంగా డ్రైన్ లు పరిశుభ్రపరచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 9వ డివిజన్ బెంజ్ సర్కిల్ నుండి స్క్రూ బ్రిడ్జ్ వరకు సర్వీస్ రోడ్లో కమిషనర్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైడ్ డ్రైన్లో పూడికలను ఎప్పటికప్పుడు తీసివేయాలని, వర్షపు నీటి నిలువలు రోడ్డుపైన నిలువకుండా ఉండేందుకు సైడ్ కాలవలను పరిశుభ్రంగా ఉంచాలని, …
Read More »