-గొల్లప్రోలు మండల పరిధిలో రూ. 5.52 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ శాఖామాత్యులు పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గొల్లప్రోలు బాలుర జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 28.5 లక్షల అంచనా వ్యయంతో సీఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న గొల్లప్రోలు తహసీల్దార్ భవన నిర్మాణం పనులు ప్రారంభించారు. …
Read More »