Breaking News

పోలవరం ప్రాజెక్టును 45.72 మీ.ఎత్తుకు నిర్మించి తీరుతాం దీనిలో రాజీపడబోం

-41.15 మీ.ఎత్తుకే నీరు నింపుతామని గత ప్రభుత్వమే కేంద్రానికి ప్రతిపాదన పంపింది
-దానిపై ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు పిపిఏ ఇచ్చిన సమాధానం వైసిపికి చెంపపెట్టు
-నదుల అనుసంధాన ప్రక్రియ ద్వారా గోదావరి మిగులు జలాలను ఉత్తరాంధ్ర,రాయల సీమకు అందింస్తాం
-రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు డా.నిమ్మల రామానాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి నీటిని నిల్వ చేయడం జరుగుతుందని ఈవిషయంలో ఎంతమాత్రం రాజీపడబోమని రాష్ట్ర జల వనరుల శాఖమాత్యులు డా.నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సియం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈఏడాది ఫిబ్రవరి 29వతేదీన 41.15 మీటర్ల ఎత్తుకు పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని కేంద్రానికి ప్రతిపాదను పంపగా రివైజ్డ్ కాస్ట్ కమిటీ రూ.47వేల 617 కోట్లు ఆమోదం తెలిపిందని ఈప్రకారం కేంద్ర కేబినెట్ పోలవరానికి రూ.12వేల 157 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.కాని వైసిపి నేతలు వారి సాక్షి పత్రిక నిత్యం పోలవరం ప్రాజెక్టుపై విషం చిమ్మడంతో పాటు ప్రజలను తప్పుద్రోవ పట్టించే విధంగా విషపు రాతలు రాస్తోందని పేర్కొన్నారు.గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును,డయాఫ్రంవాల్ ను విధ్వంసం చేయగా సియం చంద్రబాబు నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ ఇతర పనులను తిరిగి పునర్మించడం జరుగుతోందని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు.
2014-2019లో తమ ప్రభుత్వ పాలనలో పోలవరం ప్రాజెక్టు ఫేజ్ -1,ఫేజ్ -2,అని గాని ఎత్తు తగ్గింపు అనిగాని ఉంటే సాక్ష్యం చూపాలని తాను శాసన మండలిలో సవాలు విసిరితే వైసీపీ సభ్యులు తోక ముడిచారని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.ఈప్రభుత్వం వచ్చాక పోలవరం ఎత్తు తగ్గించేస్తోందంటూ చేస్తున్నవిష ప్రచారానికి మొసలి కన్నీటికి సమాచార హక్కు చట్టం ద్వారా పిపిఎ ఇచ్చిన సమాధానం వైసీపీ కి చెంపపెట్టని అన్నారు.పోలవరం చరిత్రలో 41.15 మీటర్లు అంటూ ఫేజ్-1 కు బీజం పడింది,వేసింది గత వైసీపీ ప్రభుత్వమేనని ప్రధాన డ్యామ్ లో 45.72 మీటర్లకు కాకుండా 41.15 మీటర్ల ఎత్తుకే నీళ్లు నింపడం అనే ప్రతిపాదన జగన్ ప్రభుత్వమే కేంద్రానికి ప్రతిపాదన పంపిందని పీపీఏ కుండబద్దలు కొట్టిందని మంత్రి పునరుద్ఘాటించారు.ఒక అబద్దాన్ని 100 సార్లు చెప్పినా నిజం కాదన్న సత్యాన్ని మాజీ సియం జగన్ గ్రహించాలని హితవు చేశారు.ఆంధ్రుల జీవనాడి రాష్ట్ర ఆర్ధిక సంపద పెరుగుదలకు ఆధార బిందువు పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు.
అదే విధంగా సియం చంద్రబాబు ఆలోచన నదుల అనుసంధానం ప్రక్రియని అందుకు అసలు పునాది పోలవరం ప్రాజెక్టని,గోదావరి మిగులు జలాలను నదుల అనుసంధాన ప్రక్రియ ద్వారా ఉత్తరాంధ్ర,రాయలసీమలకు తరలిస్తామని మంత్రి చెప్పారు.కేంద్రంలో,రాష్ట్రంలో ఉన్నది ఎన్డీయే డబుల్ ఇంజన్ సర్కారని కావున పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సారథ్యంలో పోలవరం ప్రాజెక్టును వేగవతంగా పూర్తి చేసి తీరుతామని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు.

Check Also

ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలి- తేజ్ భరత్ మెప్మా డైరెక్టర్

-లాంఛనంగా ప్రారంభమైన సంజా ఉత్సవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలని నినాదంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *