రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ నందు 9 వ అధనపు జిల్లా న్యాయమూర్తి ఎమ్.మాధురి, 2 వ అధనపు సీనియర్ సివిల్ జడ్జ్ బి.పద్మ, జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాశ్ బాబు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం లో న్యాయవాదుల కు మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎమ్.మాధురి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా సమయం వృధా కాదని, త్వరితగతిన ప్రయోజనం సమకూరుతుందని, ఖర్చులు లేనటువంటిదని తెలిపారు. బి.పద్మ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా సామరస్యపూర్వకంగా కేసులను పరిష్కరించుకోవచ్చని మరియు మధ్యవర్తిత్వం లోని మెళకువలు వివరించారు.
Tags rajamandri
Check Also
విజేతల స్ఫూర్తితో ఉన్నత శిఖరాలకు ఎదగాలి
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు గడ్డపై నుంచి ఎందరో …