Breaking News

“ప్రీ-అరెస్టు, అరెస్టు మరియు రిమాండ్ దశలలో అందుబాటులో ఉన్న న్యాయ సేవలు”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం లోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆఫీసు నందు “ప్రీ-అరెస్టు, అరెస్టు మరియు రిమాండ్ దశలలో అందుబాటులో ఉన్న న్యాయ సేవలు”, అంశాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు న్యాయమూర్తి కె .ప్రకాష్ బాబు మాట్లాడుతూ ప్రీ-అరెస్టు, అరెస్టు మరియు రిమాండ్ దశలలో నిందితులకు/ముద్దాయిలకు అందుబాటులో ఉన్న న్యాయ సేవలు గురించి వివరించారు. నిందితులను కస్టడీలోకి తీసుకునే ముందు అందుకు గల కారణాలను ఖచ్చితంగా నిందితునికి, అతని కుటుంబ సభ్యులకు తెలియపరచాలి. అరెస్టయిన వ్యక్తికి విచారణ సమయంలో తనకు నచ్చిన న్యాయవాదిని కలిసే హక్కు ఉంటుంది. అలాగే న్యాయవాది లేని పక్షంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలను, ఉచిత న్యాయవాదిని పొందే హక్కు వారికి ఉందని వివరించాలి. నోటీసు, అరెస్టు మొదలుకుని, చార్జ్ షీట్, విచారణ, రిమాండ్ లాంటి ప్రతీ దశలోనూ నిందితుని హక్కులకు భంగం కలగకుండా పోలీసు అధికారులు తమ విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో అడిషనల్ ఎస్.పి ఎన్.బి.ఎమ్.మురలి కృష్ణ , రిటైర్డ్ అడిషనల్ పబ్లిక్ ప్రొసెక్కుటర్ వి. విశ్వనాధం , వివిధ పోలీసు అధికార్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

విజేత‌ల స్ఫూర్తితో ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎద‌గాలి

– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు గ‌డ్డ‌పై నుంచి ఎంద‌రో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *