-కాకరపర్రు లాకు నుండి సిద్ధాంతం లాకు వరకు…
-బ్యాంకు కెనాల్, నరసాపురం కెనాల్ మీద పెరవలి లాకు వరకు విస్తృత పర్యటన…
ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక రైతుల ఫిర్యాదుల మేరకు కాలువ లపై పేరుకు పోయిన గుఱ్ఱపుడెక్క, తూడు లను వాస్తవంగా పరిశీలించేందుకు కాకరపర్రు డ్రైయిన్ వద్దకు రావడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు పేర్కొన్నారు. బుధవారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండల వెలివెన్ను గ్రామంలో గల కాకరపర్రు లాకులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి నిడదవోలు నియోజకవర్గం శాసనసభ్యులు జి.శ్రీనివాస నాయుడు తో
కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ రాజు మాట్లాడుతూ, కాకరపర్రు లాకు నుండి సిద్ధాంతం లాకు వరకు, బ్యాంకు కెనాల్, నరసాపురం కెనాల్ మీద పెరవలి లాకు వరకు కాలువ లపై విస్తృతంగా పెరిగిన కార్నస్ వలన నీటి పారుదల లేకపోవడం వీటి పై ఆధారపడ్డ రైతులు నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయం తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. లాకులను పరిశీలించి అధికారులను నీటి సమస్య పరిస్కారించాలని ఆదేశించామన్నారు. జిల్లా లో పెనుగొండ ఆచంట తదితర ప్రాంతాల్లో రైతుల సాగునీటి అవసరమైన నీరు దిగువన అందకపోవడంతో ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో ఉన్న కాకరపర్రు లాకువను పరిశీలించిన గుర్రపుడెక్క పేరుకొని ఉండడంతో తొలగించాలని ఆదేశించారు. వర్షాకాల సమయంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారంతో ఇటీవల వర్షాలకీ నిడదవోలు, కొవ్వూరు , ఏలూరు ఉన్న ఆయకట్టు రైతుల పొలాలు వర్షాల కారణంగా మునిగిపోవడంతో స్థానిక అధికారులు, శాసనసభ్యులు ఆధ్వర్యంలో విజ్జేశ్వరం లాకులు వద్ద నుండి ఏడు వేల క్యూసెక్కుల నుంచి 5 వేల క్యూసెక్కుల ను దిగువకు విడుదల చేశామని తెలిపారు. ప్రస్తుతం విజ్జేశ్వరం వద్ద నీటి స్థాయి 2000 క్యూసెక్కులకు కుదించిడంతో గత రెండు రోజులుగా దిగువన ఉన్న పంట పొలాలకు నీరు అందడం పోవడం గుర్తించమన్నారు. ఈ సమస్య పరిష్కారానికి అధికారులకు కొన్ని సూచనలు ఇచ్చామని మంత్రి తెలిపారు. అదేవిధంగా గుర్రపుడెక్క వెంటనే తొలగించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. వర్షాలు కాలం తరువాత నుండి కాలువల్లోకి నీరు రావడంతో తెల్లగా మారడం వలన నీటిలోని కర్ర నాచు ఏర్పడుతోందని దీనివల్ల కాలువల యొక్క ప్రవాహం తగ్గుతుందన్నారు. దానిని నియంత్రించడానికి కావాల్సిన యంత్రాలను అందుబాటులోకి తీసుకుని వొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని శ్రీరంగనాధ రాజు చెప్పారు. ఈ యంత్రాలను ప్రతి మండలం లోని ఏర్పాటు చేసి ఈ యొక్క కర్ర నాచు వర్షాకాలంలో వచ్చే ఎర్ర నీటికీ చనిపోతుందని, మరల సిలేరు నుండి వస్తున్న నీటి వలన కర్ర నాచు ఏర్పడుతుందని , అక్టోబర్ నవంబర్ నెలల్లో ఈ నీరు రంగు తెల్లగా మారడం తో కర్ర నాచు ఏర్పడుతుందని, వీటి నివారించడానికి ప్రణాళికలు రూపొందించాలసిందిగా అధికారులకు స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మంత్రి వెంట నిడదవోలు నియోజకవర్గం శాసనసభ్యులు జి.శ్రీనివాస నాయుడు, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.