Breaking News

శాంతి, సంతోషాన్ని చిహ్నం క్రిస్మస్‌

-తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రేమ, శాంతి, దయాగుణాన్ని కలిగి ఉండాలని చెప్పడమే కాకుండా ఆ విధంగా జీవించి చూపించిన మహానీయుడు ఏసుక్రీస్తు అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయం ఆవరణలో బుధవారం ఉదయం sc సెల్ నాయకులు దున్నఏసురత్నం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్‌మీరా, కృష్ణాజిల్లా మాజీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనురాధ హజరై కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ప్రేమ, త్యాగానికి ప్రతీకలైన యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని చెప్పారు. ప్రేమ, శాంతి, దయా గుణాన్ని ప్రతిఒక్కరూ అలవరచుకోవాలని అన్నారు. ప్రేమ, దయా గుణాన్ని కలిగి ఉండాలని చెప్పడమే కాకుండా యేసుక్రీస్తు అదే విధంగా జీవించి చూపించారని అన్నారు. శాంతి, సంతోషానికి చిహ్నాం క్రిస్మస్‌ పండుగను అందరూ ఉత్సాహంగా జరుపుకోవాలని, క్రైస్తవ సోదర, సోదరీమణులందరికి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *