Breaking News

జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు ఒక యజ్ఞంలా కొనసాగాలి…

-ఇళ్ళ నిర్మాణంపై జెసి సుమిత్ కుమార్ తో సమీక్ష…
-పలాసలో డివిజన్ స్థాయి సమీక్షలో పాల్గొన్న మంత్రి…
-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు

పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న జగనన్న కాలనీల ఇళ్ళ నిర్మాణం ఒక యజ్ఞంలా కొనసాగాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అధికారులను సూచించారు. మంగళవారం పలాసలో డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జెసి హౌసింగ్ హిమాన్సు కౌషు ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ స్థాయి హౌసింగ్ సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పధకం జగనన్న కాలనీలు ఇళ్ళ నిర్మాణం. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విదంగా సిఎం జగన్మోహన్ రెడ్డి మహిళల పేరున ఇళ్ళ పట్టాలు అందించి వారికి హక్కును కల్పించడం దేశంలోనే ఎక్కడా లేని విదంగా జరుగుతుందని అన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసి లబ్ధిదారులకు ఇళ్ళ నిర్మాణాలవైపు మొగ్గు చూపించాలని అన్నారు. ఇళ్లు లేని కుటుంబం ఉండ కూడదు అనే లక్ష్యంగా మొదటి దశలో మొత్తం 34 లక్షల ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. అందరికి పట్టాలు పంపిణీ చేశామని లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవడానికి ఉన్న లోటుపాట్లను సమీక్షలో తెలుసుకున్నారు. ఇసుక, ఇటుక, సిమెంట్, ఐరన్ అందించడం తోపాటు నిర్మాణానికి యజమాని నుండి ఉపాది హామీ ద్వారా పని దినాలు కల్పించి కూలీలకు డబ్బులు ఏర్పాట్ల విషయాన్ని సమీక్షించారు. పేదవారు నిర్మాణం విషయంలో ఖర్చు చేయలేనటువంటి వారిని గుర్తించాలని కోరారు. వారికి ప్రభుత్వం ఇళ్ళు నిర్మాణం చేపట్టి అందిస్తుందని అన్నారు. పేదల ఇళ్ళ నిర్మాణంలో లబ్ధిదారులకు బిల్లులు మంజూరు విషయంలో జాప్యం జరగకుండా సకాలంలో వారికి డబ్బులు అందించ గలిగితే వారు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు కొనసాగిస్తారని అన్నారు. అంతే కాకుండా జగనన్న కాలనీలలో రోడ్లు, డ్రైనేజిలు, ఎలక్ట్రికల్, మంచినీటి సౌకర్యాలకు సంబందించిన పనులపై సమీక్ష చేపట్టారు. జగనన్న కాలనీలలో ప్రతి పని వేగవంతం కావాలని సూచించారు. టెక్కలి డివిజన్ లోని అన్ని మండలాల అధికారులతో పరిస్థితులపై చర్చించారు. పేదల ఇళ్ళ నిర్మాణం అనేది యుద్ద ప్రాతిపదికన కొనసాగాలని ప్రజలకు అవగాహన కల్పించడం తోపాటు వారికి ఉన్న సమస్యలు గుర్తించి వేగవంతం చేయాలని కోరారు. మండలాల వారీగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు, జేసీ రెవిన్యూ సుమిత్ కుమార్, జేసీ హౌసింగ్ హిమాన్సు కౌషు, పీడీ హౌసింగ్ కుర్మనాధ్, టెక్కలి ఆర్డీవో – సబ్ కలెక్టర్ వికాస్ మర్మత్, పీడీ డ్వామా కుర్మారావు, ఇచ్చాపురం, టెక్కలి, పలాస నియోజకవర్గాలకు సంబంధించిన ఆర్.డబ్ల్యూ.యస్ అధికారు, ఎలక్ట్రికల్ అధికారులు, హౌసింగ్ అధికారులు, డ్వామా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, మున్సిపల్ కమీషనర్, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *