కైకలూరు , నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ జగనన్న గ్రీన్ విలేజ్ లో ప్రజలకు కావలసిన అన్ని మౌళిక సదుపాయాలు సమకూర్చడం కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంద శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం కైకలూరు లోని ఏలూరు రోడ్ లోని వై.ఎస్.ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ లో గ్రామీణ నీటి సరఫరా ఇంజినీర్లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేడిఎన్ఆర్ మాట్లాడుతూ కాలనీలో ఇంటి నిర్మాణాలకు మంచినీటి ఇబ్బందులు ఉండకూడదని, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ప్రత్యేక అంచనాలు తయారు చేయించి, ఈ రోజు 75లక్షలు రూపాయలు ఆన్ లైన్ టెండర్ ద్వారా, ప్రముఖ కాంట్రాక్టర్ లంక వెంకటేశ్వరరావు ఈ యొక్క మంచినీటి పైపు లైన్ పనులకు ఈ రోజు పైపులు వైఎస్ఆర్ జగనన్న గ్రీన్ వీలేజ్ లో దింపటం జరిగిందన్నారు. ఇంటి నిర్మాణం చేసుకొనే అక్కచెల్లమ్మలకు కైకలూరు పట్టణంలోని ఓహెచ్ ఎస్ఆర్ నుంచి నీటిని పైపు లైన్ ద్వారా విడుదల చేస్తారన్నారు. అదేవిదంగా గ్రీన్ వీలేజ్ లో త్వరలోనే కరెంట్ సబ్ స్టేషన్ నిర్మాణం, అండర్ లైన్ కరెంట్, 18 కిలోమీటర్లు పైబడి సీసీ రోడ్డులు, పక్కా డ్రైనేజీ పనులు, రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు, అదేవిదంగా 5 ఎకరాలలో డంపింగ్ యార్డ్,10ఎకరాల అన్ని మతాల స్మశాన వాటిక, 15 ఎకరాల మంచినీటి చెరువు, సచివాలయం, ఆర్బీకే మిల్క్ ప్రాజెక్టు, వెల్నెస్ సెంటర్ ఇప్పటికే నిర్మాణాలు ప్రారభించారన్నారు. మొదటి విడతలో వచ్చిన అక్కచెల్లమ్మలకు త్వరగతిన ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలన్నారు. అదేవిదంగా ఇంకా అర్హులు ఎవరు వున్న కూడా అర్జీ పెట్టుకున్న 90 రోజులలో ఇంటి స్థలాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్ డబ్ల్యూఎస్. డీఈఈ శాస్త్రి, ఆర్ డబ్ల్యూఎస్. ఏఈఈ నాగబాబు,ఈవో లక్ష్మినారాయణ, పడమటపాలెం సర్పంచ్ సాన మీనా సరస్వతి, దానం ప్రసాద్,సాన వెంకటరామారావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
Tags kikaluru
Check Also
ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …