Breaking News

మృతి చెందిన మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటాం…

-రాష్ట్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
-చేపల వేటకు వెల్లి ముగ్గురు జాలర్లు మృతి విచారకరం…
-మృతుల కుటుంబానికి ప్రభుత్వం అన్ని విదాలా ఆదుకుంటుంది…
-మృతదేహాలను వెలికి తీసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం…
-స్థానిక ఎమ్మెల్యే, అధికారుల తో మాట్లాడిన మంత్రి

పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకాకుళం జిల్లా గార మండలంలో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెల్లిన మత్స్యకారుల్లో ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరు గార మండలంలోని బందరువానిపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు స్పందించారు. వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావుతో సంబందిత విషయం మాట్లాడి ప్రభుత్వం నుండి మృతుల కుటుంబ సభ్యులకు ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత్స్యకారులకు ఏ ప్రమాదం జరిగినా నేను ఉన్నాను అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారని అన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని విచారాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో ఇలాంటి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాకి ఒక హార్బర్ మంజూరు చేసి చేపల వేటకు అనుకూలం కల్గిస్తున్నారాని తెలిపారు. మత్స్యకారుల జీవితాలు సముద్ర అలలకు బలైపోయి తల్లి గర్భం శోక సముద్రంలో మునిగిపోతుందని ఆవేదన చెందారు. మత్స్యకారుల కష్టాలను తీర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తామని హామి ఇచ్చారు. మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకుంటుందని హామి ఇచ్చారు. జిల్లా అధికారులతో పోన్ లో మాట్లాడి అన్ని విదాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్స్యకారుల గల్లంతు విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెల్లి వీలైనంత త్వరగా వారిని ఆదుకుంటని అన్నారు. పుక్కల్ల గన్నయ్య, గణేష్ తండ్రీ కొడుకులు కాగా అదే గ్రామానికి చెందిన రాయితి పెదరాయుడు లు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.

Check Also

ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *