అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి నగరంలోని శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి ఆలయం వద్ద నిన్న రాత్రి గాలి గోపురం దక్షిణం వైపు కూలిన గోడను ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు. తొలుత ఆలయం వెలుపల మరియు ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆలయ అధికారులకు తగు సూచనలు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు , ఆలయ ప్రహరీ గోడ వద్ద ఆనుకుని ఉన్న భారీ వృక్షాల మూలంగా ప్రహరీ గోడ కూలి ఉంటది అన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి ఆలయ కమిటీ మరియు వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి ఆలయ భద్రతపై తగు సూచనలు చేశారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ సుమారు 200 సంవత్సరాల పూర్వం నిర్మించిన అతి ప్రసిద్ధి గాంచిన ఆలయ గాలిగోపురం గోడ కూలిపోవడం అత్యంత బాధాకరం అని అన్నారు. ఆలయం చుట్టూ ఉన్న ఆక్రమణలు అతి త్వరలోనే గుర్తించాలని, గాలి గోపురం చుట్టూ భారీ వాహనాలు మరియు కార్లను అనుమతించవద్దని దీని ద్వారా పెను ప్రమాదాన్ని నివారించగలం అని అన్నారు. ఆలయ భద్రతకు సంబంధించిన అంశాలపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాయనున్నట్లు తెలిపారు. ఇంతటి ప్రసిద్ధిగాంచిన ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులు అధికారులకే కాక పురః ప్రజలపై కూడా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ, నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ , ఎమ్మార్వో , ఎండిఓ , ఆలయ పరిపాలన అధికారి , పరిపాలన కమిటీ తో పాటు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
సముద్ర తీర ప్రాంతాల వద్ద భద్రత ఏర్పాట్లు సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సముద్ర తీర ప్రాంతాల వద్ద భద్రత …