-లక్ష్యానికి మించి 1,34,931 మందికి టీకాలు
-అధికారులు, సిబ్బందిని అభినందించిన కలెక్టర్ నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాలో మంగళవారం నిర్వహించిన మెగా వాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం అయినట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. లక్ష్యానికి మించి 1,34,931 మందికి టీకాలు వేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసిన ఎఎన్‌యం, ఆశ కార్యకర్తలు, విఏఓలు, వీఆర్వోలు, వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. వాక్సినేషన్ మండల అధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు, వైద్యులకు కలెక్టర్ నివాస్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Tags vijayawada
Check Also
సంజా ఉత్సవ్ ను అందరూ సందర్శించండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 26, 2024 నుండి మ్యారీస్ స్టెల్లా …