Breaking News

సీఐఐ-ఐజీబీసీ నుండి ‘‘మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రాజెక్టు’’ అవార్డు అందుకున్న రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాపు…


విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వేలో నిరంతరం చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు మరోసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాపుకు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ)-ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) వారిచే ‘‘మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రాజెక్టు’’ అవార్డు లభించింది. వ్యాగన్‌ ఓవర్‌హాలింగ్‌లో చేపట్టిన ఉత్తమమైన వినూత్న కార్యక్రమాలకు సంబంధించిన ప్రాజెక్టుకు రాయనపాడు వర్క్‌షాపుకు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు లభించింది. ‘‘ఎన్విరాన్‌మెంట్‌ బెస్ట్‌ ప్రాక్టిస్‌-2021’’ 8వ సీఐఐ జాతీయ అవార్డు కోసం జులై నెలలో సీఐఐ-ఐజీబీసీ వారిచే ఈ పోటీలు నిర్వహించబడినాయి. దీనికి 200 కంపెనీలు దరఖాస్తు చేసుకోగా వాటిలో ఉత్తమ ప్రాజెక్టులను ప్రదర్శించిన 36 కంపెనీలను ఎంపిక చేశారు. వాటిలో రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాపుకు సంబంధించిన ప్రాజెక్టుకు ఉత్తమమైన పర్యావరణ ప్రాజెక్టుగా ఎంపికై ట్రోఫీ మరియు సర్టిఫికెట్‌ లభించింది.
సీఐఐ-ఐజీబీసీ నుండి ప్రత్యేక గుర్తింపు పొంది ప్రతిష్టాత్మమైన సర్టిఫికెట్‌ అందుకున్న రాయనపాడు వర్క్‌షాపు చీఫ్‌ వర్క్‌షాపు మేనేజర్‌కి మరియు వారి బృందానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య శుభాకాంక్షలు తెలియజేశారు. వారి రోజువారి విధులలో పర్యావరణ పరిరక్షణ చర్యల కొరకు నిర్విరామంగా కృషి చేసిన ఫలితంగా ఈ ప్రత్యేక అవార్డు అందుకున్నారని ఈ యూనిట్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పర్యావరణ పరిరక్షణకు మరియు కార్బన్‌ ఉద్గారాల నివారణకు తోడ్పడే విధంగా అన్ని డివిజన్లు మరియు వర్క్‌షాపులు అనేక వినూత్న కార్యక్రమాలతో పర్యావరణ అనుకూల చర్యలు చేపడుతూ అనేక సర్టిఫికెట్లు మరియు అవార్డులు అందుకోవడంపై జనరల్‌ మేనేజర్‌ ఆనందం వ్యక్తం చేశారు.
రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాపు మరియు వారి ప్రాజెక్టు గురించి క్లుప్తంగా :
-విజయవాడ నగర పరిసరాలలో వ్యాగన్‌ వర్క్‌ షాపు నెలకొల్పబడిరది. ఇది భారతీయ రైల్వేలో బ్రాడ్‌ గేజ్‌ వ్యాగన్ల మరమ్మతులు చేయడంలో ప్రధానమైన మరియు ఆధునిక వర్క్‌షాపులలో ఒకటి.
-వివిధ సరుకుల రవాణాలో ఉపయోగించే ఓపెన్‌, కవర్డ్‌, ఫ్లాట్‌, ట్యాంకర్లు లాంటి అన్ని రకాల గూడ్స్‌ వ్యాగన్లకు కాలపరిమితి దాటక ముందు నిర్వహించే ఓవర్‌హాలింగ్‌ చేయడం ఈ వర్క్‌షాపు ప్రధాన చర్యలలో ఒక భాగం.
-వ్యాగన్‌ వర్క్‌షాపు సమీపంలో ఉన్న ఇతర పరిశ్రమల కంటే పచ్చదనంతో విరివిగా ఉంది.
-గతంలో 2021 ఫిబ్రవరి నెలలో ఈ వర్క్‌షాపు సీఐఐ-ఐజీబీసీ వారిచే గ్రీన్‌ కో-ప్లాటీనియం రేటింగ్‌ పొందింది.
-ఈ వర్క్‌షాపు పర్యావరణ పరిరక్షణకు వెల్డింగ్‌ సిమ్యులేటర్‌, రోలర్‌ బేరింగ్‌ క్లీనింగ్‌ ప్లాంట్‌ మరియు మల్టీ స్టేజ్‌ రోబోటిక్‌ డిస్ట్రిబ్యూటర్‌ వాల్వ్‌ క్లీనింగ్‌ మెషిన్‌ వంటి స్థిరమైన వనరుల రక్షణ యంత్రాలను కలిగుంది.

రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాపు వ్యాగన్స్‌ ఓవర్‌హాలింగ్‌లో ఉత్తమమైనదిగా ఎంపిక కావడానికి దోహదపడిన ప్రాజెక్టులోని ముఖ్యాంశాలు :
-వెల్డర్లకు వెల్డింగ్‌ నిర్వహించడంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ ఇచ్చింది. ఇది వెల్డర్లలో నైపుణ్యతను పెంచడమే కాకుండా వారిలో గల బలహీనతలను అధిగమించడానికి కూడా తోడ్పడిరది.
-ఆటోమెటడ్‌ రోలర్‌ బేరింగ్స్‌ క్లీనింగ్‌ ప్లాంట్‌తో శుభ్రపరిచే విధానంలో సౌలభ్యత ఏర్పడిరది. తొలగించిన రోలర్‌ బేరింగ్‌ విభాగాలను శుభ్రపరచడంలో నాణ్యత పెరిగింది. చేతితో శుభ్రపరిచే విధానం నివారించబడిరది.
-మల్టీ స్టేజ్‌ ఆల్ట్రాసోనిక్‌ రోబోటిక్‌ డిస్ట్రిబ్యూటర్‌ వాల్వ్‌ క్లీనింగ్‌ యంత్రాలతో డిస్ట్రిబ్యూటర్‌ వాల్వ్‌ల అంతర్గత భాగాలను శుభ్రపరచడంలో శారీరక శ్రమను తగ్గించింది. 130 మైక్రోన్స్‌ స్థాయి వరకు శుభ్రపరచడంలో తోడ్పడుతూ స్థూలమైన మరియు సూక్ష్మమైన పరికరాలు రెండిరటినీ కూడా సులభంగా శుభ్రపరచవచ్చు.

Check Also

సంజా ఉత్సవ్ ను అందరూ సందర్శించండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 26, 2024 నుండి మ్యారీస్ స్టెల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *