విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల ఎ.పి.పి.యస్.సి ద్వారా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మేలు చేయడం కోసం ప్రత్యేకంగా డిపార్ట్మెంటల్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారని,అయితే ఈ నోటిఫికేషన్ లో గ్రామ సచివాలయ ఉద్యోగులకు మాత్రమే అవకాశం వుంది. వార్డు సచివాలయ ఉద్యోగులకు అవసరమైన పేపర్ కోడ్ 8మరియు 10కి సంభందించి ఈ నోటిఫికేషన్ లో అవకాశం కల్పించలేదు.దీని వలన దాదాపుగా 8వేల నుండి 10వేల వరకు డిపార్ట్మెంట్ టెస్ట్ లు పాస్ కాని వార్డు కార్యదర్శులకు డిపార్ట్మెంట్ టెస్ట్ లకు సంభందించి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు.దాదాపు 40వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఈ స్పెషల్ నోటిఫికేషన్ ద్వారా అవకాశం లభించింది.అలాగే మిగిలిన 8 నుండి 10వేల మంది వార్డు సచివాలయ ఉద్యోగులకు సైతం డిపార్ట్మెంట్ టెస్ట్ లకు ఈ నోటిఫికేషన్ ద్వారా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశం కల్పించడం ద్వారా టెస్టులు పాస్ కాని వార్డు సచివాలయ కార్యదర్సులకు ఎంతో మేలు జరుగుతుందని జాని పాషా తెలిపారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వివిధ రంగాలకు చెందిన 18 మంది సభ్యులతో రాష్ట్ర సలహా కమిటీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC) వివిధ రంగాలకు చెందిన 18 మంది …