మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాల జారీకి చెందిన పనులను వేగవంతం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సంబందిత శాఖల కార్యదర్శుల సంయుక్త సమావేశంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం (సమగ్ర సర్వే) కార్యాచరణ, అమలు, మ్యుటేషన్, హౌస్ సైట్స్ పై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్ తన ఛాంబర్ నుండి జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ,డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఎ డి సర్వే గోపాలరాజా తదితరులు పాల్గొన్నారు.
సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, మ్యుటేషన్ కరెక్షన్, ట్రాన్సాక్షన్, చుక్కల భూములు, ఇన్కమ్ సర్టిఫికెట్లు, కోర్ట్ కేసులో పురోగతి, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా రీ సర్వే పూర్తవుతుందని సమగ్ర సర్వే పూర్తయిన గ్రామాలలో భూ హక్కు దారులకు జగనన్న భూ హక్కు భూ రక్ష పత్రాల జారీకి చర్యలు చేపట్టాలని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోపు రీ సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన సూచించారు. పూర్తయిన 2 వేల గ్రామాలకు త్వరలో రాష్ట్ర ముఖ్య మంత్రి భూ హక్కు పత్రాలను పంపిణీ చేసే అవకాశం ఉందని తెలిపారు. భూ హక్కు పత్రాలు ప్రింటింగ్ పనులను లక్ష్యానికి అనుగుణంగా నిర్దేశించుకొని పూర్తి చేయాలన్నారు. భూ హక్కు పత్రాలను మంజూరు చేయబోయే పట్టాదారుల వివరాలను కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించాలని తెలియజేసారు. రీ సర్వే ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ ఆర్ ఓ ఆర్, 13 నోటిఫికేషన్స్ కు సంబందించిన పనులను నిర్దేశించిన సమయం లోగా పూర్తి కావాలన్నారు. డ్రాఫ్ట్ ఆర్ ఓ ఆర్ అప్లికేషన్ అయిన వెంటనే వెరిఫికేషన్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మ్యూటేషన్స్ కోసం అందిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా నెల లోపు పూర్తి చేసేలా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా మాట్లాడుతూ, భూ సర్వే పనులు జరుగున్నాయన్నారు. జిల్లాలో 502 గ్రామాలలో 100 గ్రామాలు సంపూర్ణంగా పూర్తయ్యాయన్నారు. మిగిలిన సర్వే పనులు వేగవంతం చేస్తామని కలెక్టర్ తెలిపారు.
Tags machilipatnam
Check Also
విద్యాసాగర్ పదవీ ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలిరండి…
– ఏపీఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ పిలుపు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి ఎన్జీజీఒ …