రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. మాధురి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జిల్లా రివెన్యూ మరియు పంచాయతీ అధికారులతో సమావేశ మయ్యారు. మే 11వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ గురించి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో అత్యధిక కేసులను పరిష్కరించేందుకు సదరు అధికారులు తమ పరిధిలో ఉన్న రాజీపడదగిన కేసులను గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలని అన్నారు. ఈ సదస్సులో తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రకాష్ బాబు, గవర్నమెంటు ప్లీడరు సి.హెచ్.వి. ప్రసాద్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రివెన్యూ, పంచాయితీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Tags rajamandri
Check Also
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వివిధ రంగాలకు చెందిన 18 మంది సభ్యులతో రాష్ట్ర సలహా కమిటీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC) వివిధ రంగాలకు చెందిన 18 మంది …