గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ను ఆంధ్రప్రదేశ్ విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం తరపున స్టేట్ జనరల్ సెక్రటరీ కాళహస్తి సత్యనారాయణ, అడిషనల్ ఎస్పీ రిటైర్డ్, కె.వి.నారాయణ డిఎస్పీ రిటైర్డ్, కోశాధికారి, బివి సుబ్బారెడ్డి డీఎస్పీ రిటైర్డ్, కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్చం, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని సిబ్బందిలో సోదర భావం పెంపొందాలన్న ఉద్దేశంతో ఎస్పీ చేత కేక్ కటింగ్ చేయించారు. రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘ కార్యకలాపాలను ఎస్పీ సతీష్ కుమార్ కు వివరించారు. రిటైర్డ్ ఆఫీసర్ల సమస్యల పరిష్కారం పై ఎస్పీ సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో రిటైర్డ్ పోలీస్ అధికారుల సేవలను అవసరమైన చోట వినియోగించుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే , పోలీసు స్పోర్ట్స్ , పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా రిటైర్డ్ పోలీసు ప్రతినిధులకు ఆహ్వానాలు పంపే ఏర్పాట్లు చేస్తామని ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు.
Tags guntur
Check Also
సంజా ఉత్సవ్ ను అందరూ సందర్శించండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 26, 2024 నుండి మ్యారీస్ స్టెల్లా …