ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
దివంగత మహానేత డా.వై.ఎస్.ఆర్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్ర భవనాలు ప్రారంభింపచేయడం ఆయనకు ప్రభుత్వం ఇస్తున్న ఘననివాళి అని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు.
గురువారం ముదినేపల్లి మండలం పెద్దగొన్నూరులో నిర్మాణం పూర్తిచేసుకున్న రైతు భరోసా కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజన్న రాజ్యం జగనన్న పాలనలో ఈనాడు రైతే రాజు అని అన్నారు. ముఖ్యంగా పెద్దగొన్నూరు గ్రామంలో ఈ రైతు భరోసా కేంద్రం నిర్మాణం కోసం స్థలం ఇచ్చిన దాత బత్తుల శివరామకృష్ణ ని ప్రత్యేక ధన్యవాదము తెలిపి దాతను సన్మానించారు. ఆయనను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. రైతు శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి జగనన్న అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా క్రాప్ ఇన్సూరెన్స్ క్రింద ఒక్క కైకలూరు నియోజకవర్గంలోనే 19 కోట్ల రూపాయలు ప్రీమియం ప్రభుత్వం చెల్లించిందని, ఇది ఒక చరిత్రని, మన రైతాంగం తరపున జగనన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. ప్రజాసమస్యలు తీర్చడానికి తాను అనుక్షణం అందుబాటులో ఉంటానని, జమీందారి పోకడలు తన వద్ద లేవని, పని ఉన్న ప్రతివారు తనకు విన్నవించి సమస్యలు పరిష్కరించుకోవచ్చునని, తాను నాయకుణ్ణి కాదని సేవకుణ్ణి మాత్రమే నని అన్నారు.
Tags Mudenaypalli
Check Also
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు,,, : డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జి గీతాబాయి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, దీనిని అతిక్రమించిన …