* హాస్పటల్ సీఈవో డాక్టర్ గాజుల రమేష్ వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్-19 థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకుని కోవిడ్ మహమ్మారి బారి నుండి రక్షించుకోవాలని అను హాస్పటల్ సీఈవో డాక్టర్ గాజుల రమేష్ శుక్రవారం సూర్యారావుపేటలోని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రభుత్వం నిర్థేశించిన ధరలకే 18 ఏళ్లు పైబడిన వారికి కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సినేషన్లు మెగా డ్రైవ్‌ను ఎనికేపాడులోని అను మైబేబి హాస్పటల్‌లో ఈ నెల 11వ తేదీ (ఆదివారం) నిర్వహిస్తామని పేర్కొన్నారు. దీనికోసం ముందుగా 9542108108, 9885455891 ఫోన్ నంబర్ల నందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారందరికీ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. కోవిడ్ వచ్చి తగ్గుముఖం పట్టిన వారికి అనంతరం బ్లాక్ ఫంగస్ తదితర రకరకాలుగా దుష్ఫలితాలు కలగడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ నేఫధ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, నగర పౌరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ తీగల రమేష్, డాక్టర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ ఎస్.కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.