Breaking News

మీ వల్లే ఈ అఘాయిత్యాలు

-జగన్, వైసీపీ నేతలపై మంత్రి సవిత ఫైర్
-ఆధారాలు చూపితే నిందితులు కేసులు పెట్టి…జైల్లో పెడతామన్న మంత్రి
-జగన్ చర్చ రా… మేం సిద్ధం చర్చ
-5 ఏళ్లలో హత్యాచారాలు, హత్యలపై ఏనాడైనా స్పందించారా..?
-వైసీపీ నేతలపై మంత్రి సవిత మండిపాటు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయ ఉనికి కోసమే వైసీపీ నేతలు తమ ప్రభుత్వంపైనా, తమ నాయకులపైనా అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత మండిపడ్డారు. గడిచిన అయిదేళ్లలో జరిగిన హత్యలు, మానభంగాలపైనా ఏనాడైనా స్పందించిరా… బాధిత కుటుంబాలను పరామర్శించిరా..? అని ప్రశ్నించారు. మీ హయాంలో ఇష్టారాజ్యంగా గంజాయి అమ్మకాలు, వినియోగం పెరగడం వల్లే రాష్ట్రంలో జరిగిన అఘయిత్యాలకు కారణమని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో వైసీపీ నాయకులకు మైండ్ బ్లాంకైపోయిందన్నారు. పార్టీని…ఇతర పార్టీలోకి వెళ్లిపోతున్న తమ నాయకులను ఎలా అడ్డుకోవాలో తెలియక వైసీపీ నేతలు…చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. అధికారంలోకి వచ్చి 125 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే అమరావతి రాజధాని పనులు ప్రారంభమయ్యాయని, రేపో మాపో పోలవరం పనులు కూడా చేపట్టనున్నామని తెలిపారు. అదే సమయంలో పల్లె పండుగ పంచాయతీల వారోత్సవాల పేరుతో రూ.4,500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం…రాష్ట్రంలో స్టేట్ రోడ్ల నిర్మాణాలకు రూ.400 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇలా రాష్ట్రమంతటా అభివృద్ధి జాతర జరుగుతుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఇటీవల సత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను 48 గంట్లోనే అరెస్టు చేసి కోర్టు ముందు నిలబెట్టామన్నారు. బద్వేల్ లో ఇంటర్ విద్యార్థిని పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడిని గంటల వ్యవధిలోనే అరెస్టు చేశామన్నారు. ఈ రెండు ఘటనల్లోనూ నిందితులకు త్వరగా శిక్ష పడేలా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ రెండు సంఘటనలు జరిగిన వెంటనే తామంతా బాధితులను పరామర్శించి, ప్రభుత్వం తరఫున భరోసా కల్పించామన్నారు. ఇవన్నీ మరిచి, చంద్రబాబు ప్రభుత్వంపై బురదజల్లడానికి వైసీపీ నేతలు పోటీపడడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు సీఎం చంద్రబాబున పాలనదక్షత పూర్తి నమ్మకం ఉందన్నారు.

జగన్ బ్యాచ్ వల్లే ఈ దారుణాలు
గత అయిదేళ్ల కాలంలో 2,027 మంది మహిళలకు హత్యకు, మానభంగాలకు గురయ్యారని, ఆనాడు మీరంతా ఏమయ్యారని..? జగన్, ఇతర వైసీపీ నేతలను ఉద్దేశించి మంత్రి సవిత ప్రశ్నించారు. 250 మంది ఎస్సీ, ఎస్టీలు హత్యకు గురయ్యారన్నారని, ఏనాడైనా బాధిత కుటుంబాలను పరామర్శించిరా..?అని నిలదీశారు. ఎస్సీ యువకుడి చంపి డోర్ డెలివరీ చేసిన చరిత్ర వైసీపీ నేతలదన్నారు. సొంత బాబాయ్ ను చంపిన నిందితులను కాపాడుతున్న చరిత్ర జగన్ దన్నారు. దెయ్యాలు వేదాలు వల్లిస్తునున్నట్లు జగన్, రోజా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న అరాచకాల వెనుక జగన్ పెంచి పోషించిన గంజాయి బ్యాచ్ లు, వైసీపీ సైకో లే కారణమన్నారు. అక్రమ సంపాదన కోసం అలవాటు పడిన వైసీపీ నేతలు గంజాయి అమ్మకాలకు తెరతీశారన్నారు. దీనివల్ల గ్రామాల నుంచి నగరాల వరకు ఎక్కడ చూసినా గంజాయి వినియోగం పెరిగిపోయిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గంజాయి అమ్మకాలు, వినియోగాలపై ఉక్కు పాదం మోపుతున్నారన్నారు.

జగన్ చర్చకు రా… : మంత్రి సవిత సవాల్
ప్రజామోదం పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై జగన్, వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని మంత్రి సవిత హితవు పలికారు. గతంలో 36 మంది వైసీపీ నాయకులు రాజకీయ హత్యలకు గురయ్యారని జగన్, ఇపుడు 74 మంది మహిళలు హత్యాచారాలకు గురయ్యారని రోజా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ గాని, మరెవరైనా చర్చకొస్తే…మేం సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు జగన్, రోజా చెప్పినట్లు…ఎక్కడ ఎన్ని హత్యలు, హత్యాచారాలు జరిగియో వివరాలు బయటపెట్టాలని, కేసులు పెట్టి… నిందితులను అరెస్టు చేసి… జైల్లో పెడతామని, మీకు మాదిరిగా రేపిస్టులను కాపాడే దుష్ట బుద్ధి తమకు లేదని మంత్రి సవిత ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *