Breaking News

Daily Archives: October 11, 2024

ఇసుక సరఫరా పెంచేందుకు అందుబాటులోకి 108 కొత్త రీచ్లు

-16వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో డిమాండ్ కు తగ్గ స్థాయిలో ఇసుక సరఫరా ఉండేలా చూడాలని….ఈ విషయంలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించి వినియోగదారులు ఇబ్బందులు పడకుండా చూడాలని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మైనింగ్ శాఖపై సిఎం సచివాలయంలో సమీక్ష చేశారు. అక్టోబర్ 16వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇసుక సరఫరా కోసం మొత్తం 70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 108 …

Read More »

విజయవాడలో కన్నుల పండుగ్గా నారీ శక్తి విజయోత్సవం

-పున్నమి ఘాట్, బబ్బూరి గ్రౌండ్స్ లో మూడ్రోజులపాటు నిర్వహించే నారీ శక్తి ఉత్సవంలో మొదటి రోజు కార్యక్రమం ప్రారంభం -ఆధ్యాత్మికతను స్ఫురించేలా, మహిళా సాధికారతను స్పురించేలా సాంస్కృతికి కార్యక్రమాలు -9 మంది మహిళలకు పసుపు కుంకుమలు అందజేత -తొలిరోజులో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి  నారా భువనేశ్వరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పండుగలు ప్రజల జీవితాల్లో ఒక భాగమని దసరా పండుగ మాత్రం మహిళలకు ప్రత్యేకమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి  …

Read More »

నారీ శక్తి విజయోత్సవం మహిళా లోకానికి గెలుపు

-నారీశక్తి విజయోత్సవ సభలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -అధ్యాత్మికత స్ఫురించేలా, మహిళా సాధికారత చాటేలా తీర్చిదిద్దిన కార్యక్రమ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్ -మాతృత్వం, వీరత్వం, దాతృత్వం వంటి నవరసాలను పోషించగలిగే ఏకైక ప్రాణి ఈ ప్రపంచంలో కేవలం స్త్రీ మాత్రమే అని కీర్తించిన మంత్రి దుర్గేష్ -మానవజాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ.. త్యాగంలో, అనురాగంలో తరగని పెన్నిధి మగువ అంటూ అభివర్ణన -నారీశక్తి విజయోత్సవం కార్యక్రమం నిర్వహించడం రాష్ట్ర పర్యాటక మరియు …

Read More »

శ్రీ మహిషాసుర మర్దిని దుష్ట శక్తులపై విజయం సాధించిన దేవత

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సీతారాంపురం ఇజ్జాడ వారి వీధి నందు శుక్రవారం దసరా నవరాత్రులలో భాగంగా నేడు శ్రీ శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి పంచలోహ తురన ప్రభ మహోత్సవ కమిటీ వారు ఏర్పాటుచేసిన  “శ్రీ మహిషాసుర మర్దిని” గా దర్శనమిచ్చిన అమ్మవారిని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా సిద్దార్థ దర్శించుకుని ఆ అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలందరిపై సెంట్రల్ నియోకవర్గం పై ఉండాలని కోరుకుంటూ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం …

Read More »

మహిషాసుర మర్ది దేవి అందరికీ శక్తి, ధైర్యం మరియు విజయాన్ని ప్రసాదించాలని కోరుకుందాం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా నవరాత్రులలో భాగంగా శుక్రవారం “మహార్నవమి సందర్భంగా” ఇంద్రకీలాద్రిపై  నందు “శ్రీ మహిషాసుర మర్దిని” గా దర్శనమిచ్చిన అమ్మవారినీ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ  దర్శించుకుని ఆ అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలందరిపై సెంట్రల్ నియోకవర్గం పై ఉండాలని కోరుకుంటూ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బొండా సిద్ధార్థ మాట్లాడుతూ ఈరోజు 9వ రోజు దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ మహిషాసుర మర్దిని దేవి అమ్మవారి అలంకరణ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు …

Read More »

ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తి తో డాక్టర్ తరుణ్ కాకాని ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ నియోజకవర్గంలో సభ్యత్వాల్లో భాగంగా శుక్రవారం నందిగామ టౌన్ ఇంచార్జ్ కాకాని తరుణ్  మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ పోరు గండి నరసింహారావు మరియు అసెంబ్లీ కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య సభ్యత్వ నమోదు గురించి చర్చించడం జరిగినది నందిగామ నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడు వేల సభ్యత్వాలు చేయడం జరిగినది 16వ తారీకు వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉన్నందువలన మండల అధ్యక్షులు మరియు సభ్యత ప్రముఖులను ఈ ఐదు రోజులలో మరొక మూడు వేలు చేయవలసిందిగా కాకాని తరుణ్ …

Read More »

తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాల సమర్పణ…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఏడుకొండల పై కొలువై ఉన్న దేవ దేవుడు కలియుగ దైవం పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శుక్రవారం కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. సహాయ కార్య నిర్వహణ అధికారి బి. దొరస్వామి ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు తోడుకొని వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, సిబ్బందికి ఇంద్రకీలాద్రి కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామరావు, ఉప కార్యనిర్వహణాధికారి రత్నరాజు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శాస్త్రి స్వాగతం పలికారు. వేద పండితులు మేళ …

Read More »

అర్చకసభలో వైభవంగా మంత్రార్చన

-అర్చకసభల సంప్రదాయం కొనసాగిస్తాం -ఆలయ ఈవో కెఎస్ రామరావు వెల్లడి ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ ఆలయాల అర్చకులు ఏకకంఠంతో జగన్మాత చెంత చేసిన పారాయణం భక్తి జ్ఞానంతో మారుమోగింది. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా వేడుకల్లో భాగంగా శ్రీ మహిషాసుర మర్ధిని అవతారంలో కొలువైన అమ్మవారిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శుక్రవారం శ్రీ మల్లికార్జున స్వామి మహామండపం లోని ఆరవ అంతస్తు లో అర్చక సభ వైభవోపేతంగా జరిగింది. పంచప్రాణాల్లో మొదటిది అర్చకుడి ప్రాణం. నడిచే హరి …

Read More »

వరద బాధితులకు అపన్న హస్తంతో మేటి పశ్చిమగోదావరి జిల్లా

-ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్న కలెక్టర్ చదలవాడ నాగరాణి -జిల్లా తరుపున రూ. 1,17,75,351 చెక్కును సిఎంకు అందించిన కలెక్టర్ -లక్షలాది రూపాయలు వెచ్చించి తొలివారం ఆహార పదార్థాల పంపిణీ -కలెక్టర్ చదలవాడ నాగరాణి చొరవ, ప్రోత్సాహంతో విరాళాల వెల్లువ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో కొనసాగిన వరద సహాయక చర్యలకు అండదండలు అందించటంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు మేమున్నామంటూ తొలి వరుసలో నిలిచారు. ప్రభుత్వాధినేత పిలుపు మేరకు సేకరించిన విరాళాల మొత్తం రూ. 1,17,75,351లను శుక్రవారం అమరావతిలోని …

Read More »

ప్రజలందరిపై అమ్మవారి దీవెనలు ఉండాలి : ఎం.పి కేశినేని శివ నాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం చిట్టి నగర్ లోని శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన అమ్మవార్ని ఎంపీ కేశినేని శివ నాథ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఏం.పి కేశినేని శివ నాథ్ కి వేద పండితుల మంత్రోచ్ఛారణలతో మంగళ వాయిద్యాలతో నగరాల దేవస్థానం కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. దేవాలయ కమిటీ సభ్యులు ఎంపీ కేశినేని శివనాధుని ఘనంగా సత్కరించారు. …

Read More »