Daily Archives: October 5, 2024

వినతి పత్రాన్ని అందుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో 4వ తేదీన జరిగిన ప్రాంతీయ రైల్వే ఉన్నతాధికారులు, ఎం.పిల సమావేశంలో నరసరావుపేట గౌరవ ఎం.పి. లావు శ్రీకృష్ణ దేవరాయలు ద్వారా పెద్దకూరపాడు ప్రాంత రైల్వే ప్రయాణీకుల నుండి వినతి పత్రాన్ని అందుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ “పెద్దకూరపాడులో గుంటూరు – సికింద్రాబాద్ మధ్య నడిచే రేపల్లె ఫాస్ట్ పాసింజరు, పల్నాడు ఎక్స్ ప్రెస్ లలో ఒక ట్రైన్ కు స్టాప్ ఇస్తామని” హామీ ఇస్తున్న దృశ్యం.

Read More »

ఎన్ సిసి అకాడమీ ప్రారంభించేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నాం

– అనువైన స్థలాల లభ్యత చేకూరిన అనంతరం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించడం జరుగుతుంది. – డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎన్ సి సి..  వి. మధుసూదన్ రెడ్డి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో  ఎన్ సిసి అకాడమీ ప్రారంభించేందుకు అనువైన స్థలాలను పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరుగుతుందని ఎయిర్ కమోడోర్  డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎన్ సి సి..  వి. మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాజానగరం  గైట్ కళాశాలలో  NCC (AP&T) SNIC, …

Read More »

ఇసుక బుకింగ్, రవాణా వ్యవస్థ ను క్షేత్ర స్థాయిలో పరిశీలన

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : వాడపల్లి ఇసుక రీచ్ డిసిల్టేషన్ పాయింట్ వద్ద ఇసుక బుకింగ్, రవాణా వ్యవస్థ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగిందని రెవిన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వారి ఆదేశాల మేరకు శనివారం డివిజన్ పరిధిలో రెవిన్యూ, ఇతర అధికారులతో కలిసి ఆర్డీవో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత వివరాలు తెలియ చేస్తూ, వాడపల్లి పాయింట్ వద్ద 731 మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉందని, ఇసుక కోసం …

Read More »

స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ (SNIC) – 2024

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎయిర్ కమోడోర్ వి ఎమ్ రెడ్డి Dy DG NCC Dte(AP&T), సికింద్రాబాద్ వారు గైట్ కళాశాలలో జరిగిన ప్రత్యేక జాతీయ సమైక్యత శిబిరాన్ని సందర్శించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, NCC Dte (AP&T) ఆధ్వర్యంలో NCC Dte (AP&T) ఆధ్వర్యంలో 2024 అక్టోబర్ 02 నుండి 13 అక్టోబరు వరకు రాజమహేంద్రవరం లోని GIET ఇంజినీరింగ్ కళాశాలలో NCC Gp HQs, కాకినాడలో PAN ఇండియా NCC శిక్షణా కార్యక్రమం …

Read More »

నగరంలో ‘‘డెసెర్టినో’’ షేక్స్‌ అండ్‌ మోర్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: నగరంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్‌ (చిన్ని) శనివారం టిక్కిల్‌రోడ్డులోని డివిమేనర్‌ హోటల్‌ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ‘‘డెసెర్టినో’’ షేక్స్‌ అండ్‌ మోర్‌ బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపి కేశినేని శివనాథ్‌ను ‘‘డెసెర్టినో’’ బ్రాంచ్‌ యజమాని, నిర్వాహకులు దరిశి నరసింహారావు, డి.వి.ఎన్‌.సతీష్‌కుమార్‌ పూర్ణకుంభంతో స్వాగతించి శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్‌ మాట్లాడుతూ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని సూచించారు. యజమాని, నిర్వాహకులు దరిశి నరసింహారావు, డి.వి.ఎన్‌.సతీష్‌కుమార్‌కు …

Read More »

ఎపిజిఇఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎమ్‌.రమేష్‌ కుమార్‌ ఎన్నిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఎపిజిఇఎ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎమ్‌.రమేష్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నికయ్యారు. శనివారం విద్యాధరపురం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్‌.సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రధాన కార్యదర్శిగా ఎమ్‌.రమేష్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు తెలియచేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కామకగా ప్రభుత్వ ఉద్యోగులకు ఐ.ఆర్‌. మంజూరుచేసి, సి.ఆర్‌.సి. కమీషను హైకోర్టు బ్లడ్జ్‌/విశ్రాంత బడ్జ్‌ నేతృత్వంలో ఏర్పాటుచేసి మాతన సంవత్సరం (2025 ఉగాది) వాటికి పి.ఆర్‌.సి. అమలు …

Read More »

వరుణ్‌ బజాజ్‌ 25వ వార్షికోత్సవ సంబరాలు, ప్రపంచంలో తొలి సిఎన్‌జి బైక్‌ బజాజ్‌ ఫ్రీడమ్‌ 125 ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: భారతదేశపు నెం.1 బజాజ్‌ డీలర్‌ వరుణ్‌ బజాజ్‌ వారి విజయవాడ శాఖ తమ 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. దానితో పాటు బజాజ్‌ ఆటో వారు ప్రవేశపెట్టిన గేమ్‌ ఛేంజర్‌ బైక్‌, ప్రపంచపు మొట్టమొదటి సిఎన్‌జి బైక్‌ బజాజ్‌ ఫ్రీడమ్‌ 125ను శనివారం లారీ ఓనర్స్‌ అసోషియేషన్‌ హాల్‌, బెంజ్‌ సర్కిల్‌, విజయవాడ వద్ద ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, బజాజ్‌ ఆటో రీజనల్‌ మేనేజర్‌ …

Read More »

ఎపి టూరిజం నూతన ఛైర్మన్‌కు అభినందనలు తెలిపిన తరుణ్‌ కాకాని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా శనివారం బాధ్యతలు స్వీకరించిన నూకల బాలాజీని మర్యాదపూర్వకంగా ఆంధ్రప్రదేశ్‌ అడ్వెంచర్‌ టూరిజం ఫోరమ్‌ ప్రెసిడెంట్‌, ఏపీ చాంబర్స్‌ టూరిజం ప్యానెల్‌ వైస్‌ చైర్మన్‌, మరియు అమరావతి బోటింగ్‌ క్లబ్‌ చైర్మన్‌ డాక్టర్‌ తరుణ్‌ కాకాని కలిసి దుశ్శాలువ కప్పి పూల మొక్క అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం పర్యాటక దినోత్సవ సందర్భంగా ఉత్తమ ఇన్బౌండ్‌ అడ్వెంచర్‌ టూర్‌ ఆపరేటర్‌ కేటగిరీలో అవార్డు అందుకున్నందుకు డాక్టర్‌ తరుణ్‌ కాకానిని ఏపీటీడీసీ చైర్మన్‌ బాలాజీ …

Read More »

వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు పలు సూచనలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన ఆవరణలో గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ . గంధం సునీత బాలల హక్కుల పరిరక్షణ మరియు కనిపించకుండా పోయిన బాలల కోసం వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థల వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పిల్లలు విద్యాభ్యాసానికి దూరం కాకూడదని, వివిధ కారణాల చేత ప్రాధమిక విద్యకు దూరమవుతున్న పిల్లలను గుర్తించి వారిని బడికి పంపించే దిశగా చర్యలు ముమ్మరం …

Read More »

అర్జీలు పరిష్కారం కోసం ప్రజలను ప్రభుత్వ కార్యాలయాలకు తిప్పుకోవద్దు

-ప్రజల్లో నమ్మకాన్ని కల్పిస్తే మీ వద్దకే పరిష్కారం కోసం వస్తారు -మండల స్థాయిలో పరిష్కారం లభించే వాటి కోసం కలక్టరేట్ కి వస్తే క్షేత్ర స్థాయి అధికారి వివరణ ఇవ్వాలి -అవసరమైతే క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి పరిష్కారం చేయ్యాలి -రానున్న మూడు రోజుల్లో పరిష్కారం చేయవలసినవి 21 అర్జీలు -కలెక్టరు పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా క్షేత్ర స్థాయిలో అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. …

Read More »