Breaking News

స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ (SNIC) – 2024

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎయిర్ కమోడోర్ వి ఎమ్ రెడ్డి Dy DG NCC Dte(AP&T), సికింద్రాబాద్ వారు గైట్ కళాశాలలో జరిగిన ప్రత్యేక జాతీయ సమైక్యత శిబిరాన్ని సందర్శించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, NCC Dte (AP&T) ఆధ్వర్యంలో NCC Dte (AP&T) ఆధ్వర్యంలో 2024 అక్టోబర్ 02 నుండి 13 అక్టోబరు వరకు రాజమహేంద్రవరం లోని GIET ఇంజినీరింగ్ కళాశాలలో NCC Gp HQs, కాకినాడలో PAN ఇండియా NCC శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.. 29 రాష్ట్రాలు మరియు 07 కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశంలోని మొత్తం 17 ఎన్సిసి డిటిల నుండి ప్రత్యేకంగా ఎంపిక చేసిన 300 మంది సీనియర్ ఎన్.సి.సి., క్యాడెట్లు హాజరవుతున్న ఈ శిబిరం యొక్క వ్యవధి 12 రోజులు నిర్వహిస్తామని , ఈ శిబిరాన్ని సందర్శించి యువ ఎన్ సి సి క్యాడేట్ల ను ప్రోత్సహించడమే ప్రాథమిక లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. జాతీయ సమైక్యత మరియు సాంస్కృతిక వారసత్వం మరియు క్యాడెట్లలో ప్రతి రాష్ట్రం యొక్క గొప్ప సంప్రదాయాల గురించి సాధారణ అవగాహనను పెంపొందించడం, క్యాడెట్లు కమ్యూనిటీ లివింగ్, దేశ నిర్మాణం యొక్క ఏకత్వ భావన దిశగా స్పూర్తి నిచ్చే కార్యక్రమం చెప్పట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా ప్రభుత్వాల సంప్రదింపులతో ఆయా ప్రాంతాలలో అనువైన ప్రదేశంలో NCC అకాడమీ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించడం జరుగుతోందని తెలిపారు. వెలగపూడి సచివాలయానికి సమీపంలో గుంటూరు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక NCC డైరెక్టరేట్ కోసం ప్రణాళిక రూపొందించడం జరిగింది అని తెలియ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న క్యాడట్ల ను, శిక్షణ కార్యక్రమం లో పాల్గొన్న ట్రైనర్ లను ఆయన అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *