కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వాడపల్లి ఇసుక రీచ్ డిసిల్టేషన్ పాయింట్ వద్ద ఇసుక బుకింగ్, రవాణా వ్యవస్థ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగిందని రెవిన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వారి ఆదేశాల మేరకు శనివారం డివిజన్ పరిధిలో రెవిన్యూ, ఇతర అధికారులతో కలిసి ఆర్డీవో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత వివరాలు తెలియ చేస్తూ, వాడపల్లి పాయింట్ వద్ద 731 మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉందని, ఇసుక కోసం 43 ఆర్డర్లు లు స్లోట్ ఎలాట్ చేశామన్నారు. బుకింగ్ విధానం పరిశీలన చేసినట్లు, రికార్డు ల నిర్వహణ విషయంలో సూచనలను చెయ్యడం జరిగిందని తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, ఈ విషయంలో ఎటువంటి డీవీయేషన్ లేకుండా చూసుకోవాలన్నారు. కొవ్వూరు, నిడదవోలు పట్టణం మరియు మండలంలో జూనియర్ సివిల్ జడ్జిల కోర్టు భవనం మరియు నివాస గృహాల నిర్మాణం కోసం అనువైన భూమి నీ గుర్తించి బదలాయింపు ప్రక్రియ లో భాగంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగిందని రెవిన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత తెలిపారు. క్షేత్ర స్థాయిలో కొవ్వూరు ,నిడదవోలు మండల పరిథిలో తహసిల్దార్, రెవిన్యూ సిబ్బందితో కలిసి ఆర్డీవో పర్యటించడం జరిగింది.
Prajavartha Online Telugu News