-ప్రజల్లో నమ్మకాన్ని కల్పిస్తే మీ వద్దకే పరిష్కారం కోసం వస్తారు
-మండల స్థాయిలో పరిష్కారం లభించే వాటి కోసం కలక్టరేట్ కి వస్తే క్షేత్ర స్థాయి అధికారి వివరణ ఇవ్వాలి
-అవసరమైతే క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి పరిష్కారం చేయ్యాలి
-రానున్న మూడు రోజుల్లో పరిష్కారం చేయవలసినవి 21 అర్జీలు
-కలెక్టరు పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా క్షేత్ర స్థాయిలో అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ శాఖల వారీగా పి జి ఆర్ ఎస్ అర్జీలు పరిష్కార పరిస్థితి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, అర్జీల పరిష్కారంలో జరుగుతు న్న జాప్యంపై రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాల వారీగా సమీక్ష చేస్తూన్నట్లు తెలియ చేశారు. రెవిన్యూ, పంచాయతి రాజ్ శాఖల పరంగా అత్యధికంగా ప్రతి సోమవారం అర్జీలు పరిష్కార మార్గం కోసం రావడం జరుగుతోందని పేర్కొన్నారు. ఆమేరకు అదే స్థాయిలో వాటిని పరిష్కారం చేసే దిశగా మండల స్థాయి అధికారులు వ్యక్తిగత పర్యవేక్షణ అవసరం అన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి , మంత్రుల కార్యాలయాలు నుంచి , కలక్టరేట్ నుంచి వొచ్చి అర్జీలు పరిష్కార విషయములో మరింత సమర్థవంతంగా పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డివిజన్ మండల స్థాయి పరిష్కారం లభించే అర్జీలు కలక్టరేట్ కు రావడం జరుగుతోందన్నారు. వారికి మీ మీ కార్యాలయాల్లో పరిష్కారం పై సందేహాలు ఉన్న నేపధ్యంలో కలక్టరేట్ కు వస్తున్నారనీ, నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచేలా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మండల పరిధిలో పరిష్కారం కోసం వొచ్చిన అర్జీని ఎందుకు పెండింగ్ ఉంచాల్సి వొచ్చింది, సర్వేయర్ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయలేదా అంటూ తహసిల్దార్ ను వ్యక్తిగతం గా కలెక్టర్ వివరణ కోరారు. అదే విధంగా ఆర్ అండ్ బి కి చెందిన నల్లజర్ల రాష్ట్ర రహదారి మార్గంలో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు కోసం వొచ్చిన ఆర్జీ విషయములో జాతీయ, రాష్ట్ర హై వే లలో స్పీడ్ నియంత్రణా ఏర్పాటుకు ప్రభుత్వం మార్గదర్శకాలు అనుమతించని, వేగానియంత్రణ బోర్డ్ లని ఆయా యాజమాన్యాలు ఏర్పాటుకి అవకాశం కోసం పరిశీలన చేయవచ్చునని కలెక్టరు కి వివరించారు. అర్జీలు పరిష్కారం స్థాయి 90 శాతం పైగా ఉన్నా, నూటికి నూరు శాతం పరిష్కారం దిశగా అడుగులు వేయాలనీ కలెక్టరు ప్రశాంతి తెలిపారు. జిల్లాలో 763 అర్జీలు పెండింగులో ఉన్నాయని, వాటిలో 72 గంటల్లోగా పరిష్కారం చెయ్యాల్సినవి 21 , నాలుగు రోజుల నుంచి తొమ్మిది రోజుల్లోగా పరిష్కారం చేయవలసినవి 78, పది రోజుల్లోగా పరిష్కారం చేయవలసినవి 650 ఉన్నాయని పేర్కొన్నారు. అర్జీలు పరిష్కారం కోసం గరిష్టంగా 10 రోజులు పరిష్కారం చేయవలసి ఉంటుందన్నారు. వీటిలో పరిష్కారం పరిమితుల దాటినవి 3 ఉన్నాయనీ మైన్స్ 2, రెవిన్యూ ఒకటి ఉన్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి, ఆర్డీవో , మండల స్థాయి లో పెండింగులో ఉన్న పి జి ఆర్ ఎస్ అర్జీలు పరిష్కారం చెయ్యని అధికారుల వారీగా ఆయా అధికారులను వివరణ కోరుతూ లేఖలు రాయడం జరిగిందన్నారు. అర్జీలు పరిష్కారం చెయ్యని వాటికీ సహేతుకమైన కారణాలు తెలియ చెయ్యాల్సి ఉంటుందన్నారు. ఆమేరకు సంబంధిత శాఖల అధికారులు వ్యక్తిగతం గా హాజరై వివరణ ఇస్తూ, యదార్ధ స్థితి నీ కలెక్టరు కు వివారించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News