Breaking News

వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు పలు సూచనలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన ఆవరణలో గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ . గంధం సునీత బాలల హక్కుల పరిరక్షణ మరియు కనిపించకుండా పోయిన బాలల కోసం వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థల వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పిల్లలు విద్యాభ్యాసానికి దూరం కాకూడదని, వివిధ కారణాల చేత ప్రాధమిక విద్యకు దూరమవుతున్న పిల్లలను గుర్తించి వారిని బడికి పంపించే దిశగా చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. ఈ మేరకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. వివిధ శాఖల సమన్వయ కృషితో పిల్లలను కాపాడి వారికి అవసరమైన సహాయం అందించాలని పేర్కొన్నారు. పిల్లల హక్కులకు భంగం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ విషయమై ఎప్పటికప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కు నివేదిక అందించాలని అన్నారు. ఈ సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్. కె. ప్రకాష్ బాబు , మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పి.డి. కె. విజయ కుమారి , ప్యానల్ లాయర్లు, న్యాయవాది మరియు ట్రైన్డ్ మీడియేటర్ పి. శ్రీనివాస రావు, జి.ఎస్.కె.ఎమ్. లా కాలేజ్ ప్రిన్సిపల్ మధుసూదన రావు , ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహం సూపరింటెండెంట్ భాస్కర్ , జువెనిలే జస్టిస్ బోర్డు అధికార్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సూర్య ప్రభావతీ , పోలీసు అధికార్లు, రెవెన్యూ అధికార్లు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికార్లు, తదితర శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, జి.ఎస్.కె.ఎమ్. లా కాలేజ్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి. గంధం సునీత జిల్లా కోర్ట్ ఆవరణలో “రోడ్డు ప్రమాదాల నివారణ” మరియు “హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకత” గురించి ప్లీడర్ గుమస్తాలు కు వివరించారు, యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా, రాజమహేంద్రవరం వారి సహకారం తో హెల్మెట్ లేకుండా ద్వి చక్ర వాహనం నడిపే పై ప్లీడర్ గుమస్తాలు కు హెల్మెట్లు పంపిణీ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *